హిమాలయాల్లో 'యతి' జాడలు

హిమాలయాల్లో 'యతి' జాడలు

యతి.. అలియాస్ మంచు మనిషి.. భారీ శరీరంతో కనిపించే ఈ మంచు మనిషి గురించి గతంలో పురాణాలు, పాత సినిమాల్లో వినే ఉంటారు. మంచు మనిషి ప్రస్తావన మొన్నటి వరకు కేవలం కల్పితమనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు మనిషి జాడలు కనిపించాయట. ఈ మేరకు భారత ఆర్మీనే నిర్దారించింది. నేపాల్ సమీపంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్‌లో పేర్కొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *