వెస్టిండిస్‌తో తలపడనున్న భారత్‌

వెస్టిండిస్‌తో తలపడనున్న భారత్‌

ప్రపంచకప్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఇంత వరకు అపజయమే ఎరుగని టీం ఇండియా.. టోర్నీలో బోణి విజయానికే పరితమైన విండీస్‌తో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్‌ జరిగే మాంచెస్టర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఇరుజట్లలో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రపంచకప్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌కు మాంచెస్టర్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 9 పాయింట్లతో ఊపుమీదున్న టీం ఇండియా.. ఆరు మ్యాచ్‌ల్లో బోణి విజయంతో 3 పాయింట్లు సాధించిన కరేబియన్‌ టీమ్‌తో తలపడనుంది. ఆఫ్గన్‌తో తడబడి గెలిచిన టీం ఇండియా ఈ మ్యాచ్‌లో పూర్తిగా సత్తా చాటాలి. మరోవైపు ప్రతీ మ్యాచ్‌లో గెలుపు ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విండీస్.. ఈ మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోడానికి రెడీ అయ్యింది.

విండీస్‌తో మ్యాచ్.. భారత్ ఫిట్‌నెస్, శక్తిసామర్థ్యాలకు పరీక్షగా నిలవనున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల గాయాలు జట్టుకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా టోర్నీ నుంచే నిష్ర్కమించాడు. ధావన్‌ స్థానంలో ఓపెనర్ రాహుల్ వెళ్లడం, నాల్గవ స్థానంలో వచ్చిన విజయ శంకర్ అంచనాల్ని అందుకోకపోవడం టీం ఇండియాను కంగారుపెడుతోంది. దీంతో ప్రపంచకప్‌కు ముందు సమస్యగా మారిన నాల్గవ స్థానంపై చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ స్థానంలో దిగుతున్న విజయశంకర్ స్థాయికి తగ్గట్లు లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. బౌలింగ్‌లోనూ పనికొస్తాడని భావించిన శంకర్‌కు ఆఫ్గన్‌తో పోరులో ఒక్క ఓవర్ ఇవ్వలేదు. దీంతో బ్యాటింగ్ భారం మరోసారి రోహిత్, కోహ్లీలపైనే పడనుంది. ఇక వీరద్దరూ టోర్నీలో ఫుల్‌ఫామ్‌లో ఉండటం టీం ఇండియాకు కలిసొచ్చే అంశం. మిడిలార్డ్‌లో ధోని, జాదవ్ మరోసారి సత్తా చాటాలి. ఆఖరిలో మెరుపు మెరిపించడానికి హార్దీక్‌ పాండ్యా ఎలాగో ఉన్నాడు.

తొడ కండరాల గాయంతో ఆఫ్గన్‌తో పోరుకు దూరమైన ఫేసర్ భువనేశ్వర్ కోలుకున్నాడు. అతడు నెట్స్‌లో సాధన చేశాడు. చాలా సేపు బౌలింగ్‌ చేశాడు. వెస్టీండీస్‌తో భువీని ఆడిస్తారా అన్నది ఆసక్తి కరం. ఆఫ్గన్‌తో మ్యాచ్‌కు భువీ స్థానంలో షమీని ఎంపిక చేశారు. అద్భుతమైన బౌలింగ్‌తో షమీ అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో హ్యాట్రీక్‌ తీసి టీం ఇండియాకు విజయాన్ని అందించాడు. అయితే తొలి మ్యాచ్‌ నుండి భ్రుమాకు.. భువీని జతగా భారత్ ఆడిస్తోంది. భువీ సైతం అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆఫ్గన్‌తో షమీ ప్రదర్శన ఆధారంగా రెండో పేసర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఎండ్ లెస్ స్పినర్స్‌ కుల్దీప్‌, చాహల్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ చెలరేగితే విండీస్ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు.

మరోవైపు టోర్నీకి ముందు ఖచ్చితంగా సెమీ ఫైనల్స్‌కు చేరగల జట్లలో చాలా మంది వెస్టిండీస్‌ను చేర్చారు. కానీ ఆరు మ్యాచుల్లో విండీస్ బోణి విజయానికే పరితమైంది. మిగితా 3 మ్యాచుల్లో భారీ తేడాతో విజయాన్ని సాధిస్తేనే విండీస్‌కు సెమీస్ అవకాలుంటాయి. దీంతో విండీస్‌కు టీం ఇండియా మ్యాచ్ కీలకం కానుంది. కివీస్ మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చిన క్రిస్‌గేల్.. టీం ఇండియాపై సత్తా చాటాలని ఆజట్టు మ్యానెజ్‌ మెంట్‌ ఆశిస్తోంది. పవర్‌ఫుల్‌ హిట్టర్ రస్సెల్‌ గాయం ఆ జట్టుకు పెద్దదెబ్బ. రస్సెల్ టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్ర మించాడు. షయ్‌ హోబ్‌, హెట్‌ మేయర్‌ ఫామ్‌లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం లేదు. నికోలస్ పూరన్, హోల్డర్ బ్యాటింగ్‌లో సత్తా చాటక పరిస్థితి ఏర్పడింది. ఆల్‌ రౌండర్ బ్రాట్‌ వేయిట్ కివీస్ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో చెలరేగి అద్భుత ఫాంలో ఉన్నాడు. బౌలింగ్‌లో విండీస్‌ ఈమెగా టోర్నీలో ఫర్వాలేదనిపిస్తోంది. ఆజట్టు బౌలర్లు యార్‌కర్లు, బౌన్స్‌సర్లతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. కాట్రెల్, థామస్‌ బౌలింగ్‌లో ఫామ్‌లో ఉన్నారు. ఈ యంగ్‌ స్టర్స్‌పై మరోసారి నమ్మకం పెట్టుకుంది విండీస్ టీం. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్న టీం ఇండియాను విండీస్ బౌలర్లు ఈ మ్చాచ్‌లో ఎలా కంట్రోల్‌ చేస్తారనే దాన్ని బట్టి ఆ జట్టు విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

మొత్తానికి విండీస్‌పై విజయంతో సెమీస్‌ బెర్త్ ను కన్‌ ఫామ్‌ చేసుకోవాలని టీం ఇండిఆయా బరిలోకి దిగుతుంటే.. మ్యాచ్‌ గెలిచి సెమీస్ రేస్‌లో నిలవాలని విండీస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదంటున్నారు క్రికెట్ పండితులు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *