భారత్, వెస్టిండీస్‌ మధ్య నేడు ఐదో వన్డే

భారత్, వెస్టిండీస్‌ మధ్య నేడు ఐదో వన్డే

మరో హోం సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌తో  జరగనున్న చివరి, ఐదో వన్డేల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు వన్డేల్లో టీమిండియా గెలవగా.. ఒక వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది.  పుణెలో జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైన కోహ్లీ సేన మళ్లీ పుంజుకుని ముంబైలో జరిగిన నాలుగో వన్డేలో 224 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన అదే జోరును కొనసాగించే అవకాశముంది. 

india vs west indies 5th odi live

పరుగు దూరంలో…

 మరోవైపు ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఈ సిరీస్‌ను ప్రాక్టిస్‌ గా భావిస్తున్న రెండు టీమ్స్‌ కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి… కోహ్లీ, రోహిత్ శర్మ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. అంబటి రాయుడు కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం అశించిన మేరకు రాణించడం లేదు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఓపనింగ్‌ అధరగోడుతున్నా భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ధోనీ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు.10 వేల పరుగులు పూర్తి చేయడానికి మరో 1 పరుగు దూరంలో ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి రావడంతో టీమిండియా బలం పెరిగింది. తన సత్తా ఏంటో రెండు మ్యాచ్‌ల్లో చూపించాడు. కాగా ఖలీల్ అహ్మద్ బ్రాబోర్న్ స్టేడియంలో స్ఫూర్తిదాయక బౌలింగ్‌ను ప్రదర్శించాడు. 

dhoni 10 thousand runs

టీమ్ కు అండగా…

ఇక  టెస్టుల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్ జట్టు వన్డేల్లో కొంత పుంజుకుంది… షిమ్రన్ హెట్మేయర్, షాయ్ హోప్ టీమ్ కు అండగా ఉన్నారు… భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలనని కెప్టెన్ జాసన్ హోల్డర్ కూడా నిరూపించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ తమ సత్తాను చాటుకోలేకపోయారు.చివరి వన్డేలో టీమంతా కలిసికట్టుగా ఆడి గెలిపిస్తారని, టీమిండియా సిరీస్ విజయాన్ని అడ్డుకుంటారని హోల్డర్ ఆశిస్తున్నాడు. అయితే అది చెప్పినంత సులభం కాదు. ఎందకంటే వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులున్నప్పటికీ జట్టును గెలిపించగల తెగింపు వారిలో కనబడటం లేదు. మరి గాడ్స్‌ ఓన్‌ కంట్రీలో జరుగుతున్న మ్యాచ్‌ లో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది మరి కాసేపట్లో తేలనుంది…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *