27 ఏళ్లుగా ఫలించని పాక్ కల...భారత్‌దే రికార్డ్!!

27 ఏళ్లుగా ఫలించని పాక్ కల...భారత్‌దే రికార్డ్!!

వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన యుద్ధానికి నేడు చిరునామా కానుంది. అత్యంత ఉత్కంఠను రేపే ఈ మ్యాచ్ కోసం భారతదేశంలోని దాదాపు 40 శాతం మంది ఎదురుచూస్తారు. అయితే…అందరికీ ఉన్న ఒకే ఒక ధైర్యం భారత జట్టు. అవును…ఇప్పటిదాకా పాకిస్తాన్‌ను ప్రపంచకప్ మ్యాచుల్లో చిత్తుగా ఓడించిన భారత జట్టే క్రికెట్ అభిమానుల కొండంత అండ. ఎందుకంటే…ప్రపంచకప్ మ్యాచుల్లో పాకిస్తాన్ గత 27 ఏళ్లలో ఏనాడూ ఇండియా జట్టుపై గెలవలేకపోయింది. ఇన్నేళ్లలో పాక్ జట్టు ఆడిన ప్రతీసారి ఒట్టిడికి గురై ఆటను పోగొట్టుకుంటున్నాయి.ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గత 27 ఏళ్లుగా అజేయ రికార్డుని కొనసాగిస్తోంది భారత్ జట్టు.. ఇదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది కూడా. మరోవైపు.. పాక్ కూడా.. టీమిండియా వరుస విజయాలకు బ్రేక్‌ వేయాలని చూస్తోంది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్, పాక్ మ్యాచ్ మరింత ఉద్వేగభరితంగా మారింది. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచినా.. ఆ టోర్నీలో భారత్‌ని మాత్రం ఓడించలేకపోవడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాయాది దేశానికి…భారత్‌పై గెలవడమనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే..ఇదే ఇంగ్లాండ్‌ వేదికగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపై గెలుపొందడం ఒక్కటే ఇప్పటికీ ఆ జట్టుకి కొంచెంలో కొంచెం ఉత్సాహాన్ని ఇస్తోంది.
పాకిస్థాన్ జట్టు.. ప్రపంచకప్‌ మ్యాచుల్లో భారత్‌తో ఆరు సార్లు తలపడగా.. ఇందులో ఏకంగా ఐదుసార్లు ఛేదనకు దిగి ఓడిపోయిన రికార్డు ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసినా.. ఆ లక్ష్యాన్ని భారత్ ఊదేసింది. చివరిగా 2015 ప్రపంచకప్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసినా.. ఛేదనలో తడబడిన పాకిస్థాన్ 47 ఓవర్లలోనే 224 పరుగులకి కుప్పకూలిపోయింది.

 

గతంతో పోలిస్తే ఇవాళ జరగనున్న మ్యాచ్ మరింత ఉత్కంఠకు కారణం…పుల్వామా దాడి ఒకటైతే, ఇటీవల పాకిస్తాన్‌లోని ఒక మీడియా ఛానల్ భారత జవాన్ అభినందన్‌ను అవమానిస్తూ చేసిన యాడ్ ఈ భావోద్వేగాన్ని మరిన పెంచింది. దీంతో భారత క్రికెట్ అభిమానులతో పాటు, ప్రేక్షకులు సైతం ఈరోజు జరగనున్న మ్యాచ్ ఎలాగైన భారత్ కైవసం చేసుకుని పాక్‌కు సరైన బుద్ధి చెప్పాలని ప్రార్తిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *