పీకల్లోతు కష్టాల్లో ఇండియన్ టీమ్ !

పీకల్లోతు కష్టాల్లో ఇండియన్ టీమ్ !

వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా గెలుస్తూ ప్రత్యర్థులను చెమటలు పట్టిస్తున్న భారత్ టీమ్ న్యూజిలాండ్‌తో ఆడుతున్న సెమీస్ మ్యాచ్‌లో తడబడింది. మంగళవారం జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన కివీస్ జట్టు 211/5 స్కోరుతో ఉన్నపుడు వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. బుధవారం మళ్లీ ఆటను కొనసాగించిన కివీస్ టీమ్…239 పరుగులు చేసింది.

వరుసగా మూడు…

తక్కువ స్కోరుని చేధించే క్రమంలో భారత బ్యాట్స్‌మెన్స్ వరుస వికెట్లు కోల్పోయారు. తొలి ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియన్ టీమ్‌ను హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కొహ్లీని బౌల్ట్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పడగొట్టాడు. అయితే…తర్వాతి ఓవర్లోనే మళ్లీ హెన్రీ బౌలింగ్‌లోనే రాహుల్ సైతం లాథమ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో తొలి మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారత్ ఆటను ఎంతమేరకు పటిష్టంగా కొనసాగించి గెలుస్తుందో చూడాలి. ప్రస్తుతం భారత్ స్కోర్ 6 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 10 పరుగులతో చేసింది. క్రీజులో దినేష్ కార్తీక్, పంత్ ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *