వరల్డ్ కప్ కాదు...వాన కప్!

వరల్డ్ కప్ కాదు...వాన కప్!

ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు వర్షంతో తడిసిపోతున్నాయి. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు వర్షానికి రద్దైపోగా…ఈరోజు జరగాల్సిన కివీస్, భారత్ మ్యాచ్ కూడా వర్షం దెబ్బకు నిలిచిపోయింది. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్ కొంచెం ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం పడి మైదానం మొత్తం నీటి కొలనులా మారిపోయింది.

వర్షం వల్ల మ్యాచ్ గనక రద్దైతే…ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కుతుంది. ఈ లాభం న్యూజిలాండ్‌కే ఎక్కువ లాభాని చెబుతున్నారు విశ్లేషకులు. కివీస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇపుడు ఈ మ్యాచ్ గనక రద్దైతే ఏడు పాయింట్లతో సెమీస్‌కు సులభంగా చేరుకుంటుంది. ఇక మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా సెమీస్‌లో మొదటి రెండు స్థానాల్లో ఏదొక స్థానాన్ని సొంతం చేసుకోగలుగుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *