పోరాడి ఓడిన భారత్...జడేజా అర్ధశతకం వృధా!

పోరాడి ఓడిన భారత్...జడేజా అర్ధశతకం వృధా!

ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్‌ని బుధవారానికి వచ్చినా…మొదటిరోజు లాగే రెండోరోజు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. తొలి మూడు వికెట్లు వెంటవెంటనే పడి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉండగా…జడేజా, ధోని సంయమనంతో ప్రయత్నం చేసినా చివరి ఓవర్లలో జడేజా, ధోని వెనువెంటనే పడిపోవడంతో భారత్ ఓతమి తప్పని స్థితిలో పడింది.

భారత్ టీమ్ చివరి వరకూ పోరాడి 221 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా అర్ధశతం వృధా అయింది. దీంతో ఎంతో టెన్షన్ పెట్టిన మ్యాచ్‌లో ఎట్టకేలకు కివీస్ జట్టు బౌలింగ్ ప్రతిభతో రాణించింది. దీంతో ఫైనల్‌కు కివీస్ టీమ్ మార్గం సుగుమం చేసుకుంది. గురువారం జరగనున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఫైనల్ మ్యాచ్ ఎవరితో అనేది తేలనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *