కుప్పకూలిన కివీస్‌ 157 ఆలౌట్‌

కుప్పకూలిన కివీస్‌ 157 ఆలౌట్‌
ఆస్ట్రేలియాపై టెస్ట్‌, వన్డే సిరీస్‌లను గెల్చుకున్న టీం ఇండియా అదే ఊపులో న్యూజిలాండ్‌లో కాలుపెట్టింది. ఇక్కడ కూడా విజయపరంపరను కొనసాగించే దిశగా ముందుకెళ్తుంది. సిరీస్‌లోని మొదటి వన్డేలో సగం ఆట ముగిసేసరికి కివీస్‌ టీమ్‌ను వణికించింది. భారత్‌ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. దీంతో 157 పరుగులకే న్యూజిలాండ్‌ ఆలౌట్ అయింది.  

కుప్పకూలింది… 

మొదటి వన్డేలే టాస్‌ గెలిచిన కివీస్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. విరామం లేకుండా, కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కుదురుకోవడానికి అవకాశం లేకుండా వచ్చినవారిని వచ్చినట్టే భారత్‌ బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. న్యూజిలాండ్‌ కెప్టన్‌ కేన్‌ విలియంసన్‌ మాత్రమే 64 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌ ఎవరూ కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయారు. 

 Kane Williamson
 
భారత బౌలర్లలో కులదీప్ యాదవ్‌ 4 వికెట్లనూ, షమీ 3 వికెట్లనూ, జాదవ్‌ 1 వికెటూ, చాహల్‌ 2 వికెట్లనూ సాధించారు. 158 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. ముందున్నది స్వల్ప లక్ష్యం అవ్వడంతో టీం ఇండియా అభిమానులంతా మంచి జోష్‌లో ఉన్నారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *