ప్రపంచకప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్

ప్రపంచకప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్

ప్రపంచకప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. వెస్టిండిస్, దక్షిణాఫ్రికాపై గెలుపుతో మంచి ఊపుమీద ఉంది బంగ్లా. అయితే ఇంగ్లండ్ పై పరాజయంతో భారత్ కుర్రాళ్లు కొంత నిరాశ చెందారు. ఈ పరిణామాల మధ్య భారత్, బంగ్లాలు తలపడనున్నాయి. వాస్తవానికి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ అనగానే 2007 నాటి పరాభవమే గుర్తుకొస్తుంది. అప్పటికి పసికూన అయిన బంగ్లా.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు దిమ్మదిరిగే షాకిచ్చి గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అందుకే బంగ్లాని పసికూన కింద లెక్కేసి బరిలో దిగితే నష్టం తప్పదని క్రికెట్ విశ్లేషకులు భారత్‌ను గట్టిగా హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *