కోహ్లీని టార్గెట్‌ చేసిన ఆసీస్‌ టెస్ట్‌ టీం సారధి టిమ్ పైన్

కోహ్లీని టార్గెట్‌ చేసిన ఆసీస్‌ టెస్ట్‌ టీం సారధి  టిమ్ పైన్

ఆసీస్‌తో సిరీస్‌ అనగానే మాటల యుద్ధం మొదలవుతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే అనాధిగా ఆసీస్‌ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది. మాటల యుద్ధానికి దిగి, ప్రత్యర్థులను మానసికంగా బలహీనపరిచే పన్నాగాన్ని అమలుపురుస్తుంది. డిసెంబర్ 6 నుంచీ ప్రారంభం కాబోతున్న ఇండియా, ఆస్ట్రేలియాల నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం, గేమ్‌ ప్లాన్‌ను ఆసీస్‌ మొదలుపెట్టేసింది. కోహ్లీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తోంది.

ind vs Aus Test Series

కోహ్లీనే టార్గెట్…

ఆసీస్‌ టెస్ట్‌ టీం సారధి టిమ్ పైన్ … కోహ్లీని టార్గెట్‌ చేశాడు. తమ బౌలింగ్‌ పటిమతో టీం ఇండియా బ్యాటింగ్ లైనప్‌కూ, కోహ్లీకీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాడు. మిచెల్‌ స్టార్క్, పాట్‌ కమిన్స్‌, జాస్‌ హేజల్‌వుడ్‌ అద్భుతమైన బౌలింగ్‌తో కోహ్లీకి చిక్కులు తప్పవంటున్నాడు. తమ పేస్‌ బౌలింగ్‌ దాటికి నిలబడటానికి సిద్ధంగా ఉండమని సవాల్‌ విసిరాడు.

సమాధానమిచ్చాడు…

 టిమ్ పైన్ వ్యాఖ్యలకు కోహ్లీ గట్టి సమాధానమే ఇచ్చాడు. తాము ఎవరికీ భయపడాల్సిన స్థితిలో లేమనీ, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీం ఇండియా, ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నాడు. గతంతో పోల్చుకుంటే, ఆసీస్‌ బలం తగ్గినా, ఆసీస్‌ గడ్డపై కంగారూలు రెచ్చిపోతారు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో టీం ఇండియా ఫామ్‌ను ఎంతవరకూ కొనసాగిస్తుందో చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *