అదరగొడుతున్న ఆసీస్‌

అదరగొడుతున్న ఆసీస్‌

టీ20 సిరీస్‌ ఓటమి నుంచి టీం ఇండియా కోలుకుంది.వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి కంగారూలకు గట్టి సమాధానమే ఇచ్చింది.సొంత మైదానాల్లోనే భారత్‌తో తడబడ్డ ఆసీస్‌ టీ20 సిరీస్‌ గెలుపుతో ఊపిరిపీల్చుకుంది.అయితే ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.మొదటి రెండు వన్డేల్లోనూ ఓటమిపాలైంది. మూడో వన్డేలో ఓటమిని పునరావృతం కాకుండా కంగారూలు అదరగొడుతున్నారు.

అదరగొడుతున్నారు… 

రాంచీ జేఎస్‌సీఏ అంతర్జాతియ స్టేడియం వేదికగా టీం ఇండియా,ఆసీస్‌ల మధ్య మూడో వన్డే జరుగుతోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తో వెనకబడ్డ ఆసీస్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. టాస్‌ గెలిచిన భారత్‌ సారథి కోహ్లీ… బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. తొలి ఓవర్‌ నుంచే ఆసీస్ దూకుడును ప్రదర్శిస్తోంది. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతోన్న ఫించ్‌ తిరిగి బ్యాట్‌కు పదునుపెట్టాడు. మరో ఓపెనెర్‌ కావాజా తనదైన స్టైల్‌లో అలరిస్తున్నాడు. ఇద్దరూ చూడముచ్చటైన షాట్లతో స్కోర్‌బోర్డ్‌ను పరుగులుపెట్టిస్తున్నారు. భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే దిశగా ముందుకెళ్తున్నారు. తొలి ఓవర్‌ నుంచే ఒపెనెర్లిద్దరూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నొలకొల్పారు. 93 పరుగలు(99 బంతులు)చేసిన ఫించ్‌ను కులదీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఫించ్‌ వెనుదిరగగానే డేంజరస్‌ హిట్టర్, ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మెన్‌ మాక్స్‌వెల్‌ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనెర్‌ కవాజా 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెనెర్ల సూపర్ బ్యాటింగ్‌తో ఆసీస్‌ 33 ఒవర్లో 196 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లూ బ్యాట్‌కు పదునుచెప్తే సునాయాసంగా 330 మార్క్‌ను చేరుకునేట్టు కనిపిస్తోంది. ఆసీస్‌ ఎంత లక్ష్యాన్నిస్తుంది? భారత్ ఎలా ఎదుర్కొంటుంది? అని తెలియాలంటే ఇంకాసేపు వెయిట్‌ చేయాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *