సెల్ఫీలు తీసుకోవడం ప్రాణాంతకం!

సెల్ఫీలు తీసుకోవడం ప్రాణాంతకం!

ఇప్పటి యువతంతా సెల్ఫీల గోలలో ఉన్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే సెల్ఫీ కెమెరా బాగుందా లేదా అని ప్రత్యేకించి చూసి మరీ కొంటున్నారు. అయితే..సెల్ఫీల వల్ల ప్రమాదాలు కూడా లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 259మంది సెల్ఫీలు తీసుకుంటూనే మరణించారని ఓ ఇంగ్లీష్ మీడియా తెలిపింది. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చర్స్ పరిశోధన లెక్కల ప్రకారం.. సెల్ఫీ మరణాలు అక్టోబర్ 2011 నుంచి నవంబరు 2017లు ఎక్కువైయ్యాయి. 2011 నుంచి ప్రపంచంలో సెల్ఫీ కారణంగా చనిపోయిన వారిలో భారత్‌లో 159 వరకూ ప్రాణాలు కోల్పోయారంటే యువత ఎంతటి పిచ్చి పనులకు పూనుకుందో తెలుస్తుంది.

ఈ ప్రమాదాలను తగ్గించడానికి..సెల్పీ తీసుకోవడానికి అమితంగా ఇష్టపడుతున్న వారికి ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చావు అంచున నిలబడి సెల్ఫీలు దిగడం వల్ల ఎంత ఎంతటి ప్రాణాపాయా స్థితి ఉంటుందో చెబుతూ.. ఓ ప్రమాదకరమైన సెల్ఫీ వీడియో పోస్టు చేశారు.

ఒక యువకుడు బిల్డింగ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటుంటే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువై… బిల్డింగ్ అంచులు కూలిపోయింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా నేలకూలిపోయాడు. ఈ వీడియోను పోస్టు చేసిన ముంబై పోలీసులు ప్రాణం పోతే తిరిగిరాదని ఇలాంటి సాహసాలు చేసి బలికావద్దని సూచించారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు సెల్పీ తీసుకుంటున్న యువకుడు అదుపుతప్పి నేలమీద పడిపోయిన వీడియోను ట్వీట్ చేశారు. ‘చాలా ధైర్యంతో సెల్ఫీ తీసుకుందామనుకున్నాడో… బాధ్యతారహితంగా ఫీట్ చేద్దామనుకున్నాడో.. అనుకోకుండా ఈ ఫీట్ అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది’ అని ట్వీట్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *