అభినందన్ క్షేమంగా రండి

అభినందన్  క్షేమంగా రండి

యావత్ భారత దేశం ఇప్పుడు ఒక్కటే కోరుకుంటోంది. వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ కోసం ప్రార్థనలు చేస్తోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రతి భారతీయుడు నినదిస్తున్నాడు. భారత ప్రభుత్వం ముందు అభినందన్ ను రక్షించాలని వేడుకుంటున్నాడు. ఆయనను ఎక్కడ పాక్ హింసిస్తుందోనని ప్రతి గుండె తల్లడిల్లిపోతోంది. ఏ బాధలు పెట్టకుండా చూడు దేవుడా అంటూ ప్రార్థనలు చేస్తున్నారు సగటు పౌరులు. తమ ఇంటిలో ఒకరు ప్రమాదంలో చిక్కినట్లుగా అల్లాడిపోతున్నారు.

Abhinandan  My Hero

భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చే ప్రయత్నాన్ని గమనించి ఐఏఎఫ్ వాటిని తిప్పికొట్టింది. కానీ ఈ ప్రయత్నంలో మన యుద్ధ విమానం మిగ్-21 బైసన్ పాక్ లో పడిపోయింది. అందులోని పైలట్, ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ పాక్ చేతికి చిక్కారు. ఆయన క్షేమంగా భారత్ కు తిరగి వచ్చేలా భారత్ ప్రయత్నించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయి. #WingCommanderAbhinandan, #BringBackAbhinandan, #SayNoToWar హ్యాష్ ట్యాగ్స్ తో వీలైనంత త్వరగా ఆయన ఇంటికి చేరాలని ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో పోస్టులు హోరెత్తుతున్నాయి. అవసరమైతే యుద్ధం అనే మాట పక్కన పెట్టాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా భారత పైలట్ మిస్ అవ్వడం బాధాకరమని అన్నారు. ఆయన వీలైనంత త్వరగా భారత్ కు తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *