బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం; సెమీస్‌కు చేరిన కోహ్లీసేన

బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం; సెమీస్‌కు చేరిన కోహ్లీసేన
మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగగా.. కేఎల్‌ రాహుల్‌తో పాటు రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనను కనబర్చారు. ఇక బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీయగా, షకీబ్ అల్ హసన్, రూబెల్ హుస్సేన్, సౌమ్యా సర్కార్‌లు తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆరంభంలో దూకుడుగానే ఆడింది. కానీ కీలక సమయాల్లో ఆ జట్టు వికెట్లను కోల్పోయింది. దీంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. కాగా బంగ్లాదేశ్‌బ్యాట్స్‌మెన్లలో షకీబ్ అల్ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాకు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 3, భువీ, షమీ, చాహల్‌లు తలా ఒక వికెట్ తీశారు.

ఇక చెప్పాలంటే పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో బంగ్లా అద్భుతంగా పోరాడింది. ఓ దశలో విజయం వైపు పయనించింది. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి.. టీమిండియాకు మంచి స్కోర్‌ అందించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతేకాదు.. వరల్డ్‌కప్‌లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అత్యుత్తుమ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పింది.

మరోవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా, ఓవరాల్‌గా 26వది. ప్రపంచకప్‌లలో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును రోహిత్ అందుకున్నాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు నమోదు చేయగా, రోహిత్ 15 ఇన్నింగ్స్‌లలోనే 5 సెంచరీలు చేశాడు. ఇక ప్రపంచకప్‌ మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీని అధిగమించాడు. అంతేకాదు.. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ మరో ఘనత సాధించాడు.

ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడు కెమెరాలు, ప్రేక్షకుల కళ్లు ఆటగాళ్లపైనే ఉంటాయి. ఆ మ్యాచ్‌కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం అటువైపు కూడా ఆకర్షణ ఉంటుంది. అయితే.. భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని ప్రధానంగా హైలైట్‌ చేశాయి. అయితే.. ఆమె సెలబ్రిటీ కాదు కానీ.. తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ వృద్ధురాలు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ముఖ్యంగా రాహుల్‌-రోహిత్‌లు బౌండరీలు బాదుతుంటే ఆమె బూర ఊదుతూ తెగ సందడి చేశారు.

మొత్తానికి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత్‌ ప్రపంచకప్‌లో నమోదైన ఓపెనింగ్‌ భాగస్వామ్య రికార్డును అధిగమించింది. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *