పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట

పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట

కేరళ రాష్ట్రం వరద సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదలు తగ్గు ముఖం పట్టడంతో పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట పడుతున్నారు. కేరళ ప్రభుత్వం కూడా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ప్యాకేజీని కోరాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరదల వల్ల జరిగిన నష్ట నివారణ నిమిత్తం 2600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అడగాలని నిర్ణయించారు.

700 కోట్ల ఆర్థిక సాయం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళకు 700 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. కేరళకు అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ర్టాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం పినరయి విజయన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టామని తెలిపారు. కేరళకు  700 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అబుదాబి ప్రిన్స్.. ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు విజయన్ తెలిపారు. మరోవైపు వరదలపై చర్చించేందుకు ఈనెల 30న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

మరమ్మతులు చేపడుతున్న ప్రభుత్వం

గత రెండు రోజులుగా వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అత్యవసర సర్వీసులను పునరుద్ధరించేందుకు సర్కారు చర్యలు తీసుకోంటోంది. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపడుతున్నారు. రాజధాని తిరువనంతపురం, ఎర్నాకులం ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలను మళ్లీ నెమ్మదిగా ప్రారంభిస్తున్నారు. కోచిలోని నేవల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *