గ్రౌండ్ ఏదైనా సరే..గెలుపు మనదే!

గ్రౌండ్ ఏదైనా సరే..గెలుపు మనదే!
ఆస్ట్రేలియా మైదానాలపై బ్యాట్ ఝులిపించి ఆసీస్ టీమ్‌ని కంగారు పెట్టిన భారత జట్టు… టెస్ట్, వన్డే సెరీస్‌లను గెలిచి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌లోనూ అదే జోరుని కొనసాగిస్తూ వన్డే సెరీస్‌ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 62 పరుగులతో, సారథి విరాట్ కొహ్లీ 60 పరుగులతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ని 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
Ind vs NZ 3rd ODI Highlights

విలువైన భాగస్వామ్యం…

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్ మొదట బ్యాటింగ్ చేయడానికే నిర్ణయించాడు. కెప్టెన్‌గా 93 పరుగులు చేశాడు. టేలర్‌తో పాటు టామ్ లాథమ్ 51 పరుగులతో అర్ధశతకం చేయడంతో న్యూజిలాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ని చేసింది. వారి జట్టులో మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమవడం గమనార్హం. 243 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో శిఖర్ ధావన్ 28 పరుగులకే వెనుదిరగాడు. తర్వాత రోహిత్-కొహ్లీ జోడీ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యంతో గెలుపుని సులభం చేసింది. అయితే చివర్లో వీరిద్దరూ వెంటవెంటనే వెనుదిరగడంతో అనంతరం వచ్చిన అంబటి రాయుడు 42 బంతుల్లో 40 పరుగులు, దినేశ్ కార్తీక్ 38 బంతుల్లో 38 పరుగులతో చివరి దాకా ఉండి మ్యాచ్‌ని సులువుగా గెలిపించారు.
 
India vs New zealand 3rd ODI

వేగంగా

న్యూజిలాండ్‌ ఇచ్చిన టార్గెట్ 244 పరుగుల లక్ష్యాన్ని ఛేధించడానికి భారత్‌ తొలి నుంచి దూకుడుగా ఆడింది.  ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించారు. ధావన్‌ కొట్టిన ఎక్కువ బంతులు బౌండరీలను తాకి స్కోరును పరుగులు పెట్టించాడు. ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో  చేజిక్కించుకుంది. భారత బౌలర్ మహమ్మద్ షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాఛ్ అవార్డు లభించింది. ఇక నాలుగో వన్డే గురువారం హామిల్టన్ వేదికలో జరగనుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *