వరల్డ్ కప్‌లో భారత్‌ దూకుడు

వరల్డ్ కప్‌లో భారత్‌ దూకుడు

వరల్డ్‌కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఓవల్‌ వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో కోహ్లి సేన జయభేరి మోగించింది. మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శివాలెత్తి పరుగుల జాతరా చేయగా…. బౌలర్లు వికెట్ల వేటలో సక్సెస్ అయ్యారు. దెబ్బకు ఫేవరెట్ ఆసీస్‌కు పంచ్ పడింది.

వల్డ్ కప్‌లో టీమిండియా జయభేరి మోగిస్తోంది. మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన మెన్ఇన్ బ్లూ…. రెండవ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను కంగారు పెట్టించి అసలు సిసలైన ఆటతీరుతో క్రికెట్ ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తోంది. టైటిల్ ఫేవరెట్ల పోరులో విరాట్ సేనానే పైచేయి సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు ఆదిరిపోయే ఆరంభాన్ని అందించారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తొలి వికెట్ కు 127 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ 60 పరుగుల చేసి వెనుదిరిగాడు. అప్పటివరకు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన దావన్ కోహ్లీ క్రీజులోకి రాగానే జోరు పెంచాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా దూకుడుగా ఆడుతూ సెంచరీ సాధించాడు. 109 బంతుల్లో 16 ఫోర్ల సహాయంతో 117 పరుగులు చేసిన ధావన్‌ స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు దావన్. మరో వైపు విరాట్ వికెట్ కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్ ఔట్ అవగానే క్రీజులోకి వచ్చిన పాండ్యా దనాదన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. పాండ్య రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. 27 బంతుల్లో 3 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 48 పరుగుల చేసి ఔటయ్యాడు. దీంతో 42 ఓవర్లలోనే స్కోరు బోర్డు 300 దాటింది.

ఓ వైపు పాండ్య చెలరేగుతుంటే కోహ్లీ మాత్ర స్ట్రైక్ రొటేట్ చేస్తుండిపోయాడు. కమిన్స్ వేసిన స్లో డెలివరికి పాండ్యా ఔటవ్వడంతో ఆసీస్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం క్రీజులోకొచ్చిన ధోని ఆసీస్ స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టార్క్, కమిన్స్ ఓవర్లలో వరుసగా సిక్సులు, ఫోర్లతో ధోని విరుచుకుపడటంతో స్కోరు 340 పరుగులు దాటింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో స్టయినిస్‌కు క్యాచ్ ఇచ్చి ధోని ఔటవ్వగానే క్రీజులోకి వచ్చిర రాహుల్ ఓ ఫోరు, సిక్స్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టయినిస్‌కు రెండు, స్టార్క్, కమిన్స్, కౌల్టర్ నైల్ లకు తలో వికెట్ దక్కింది.

టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆసీస్‌… ఇన్నింగ్స్ ను దాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు వికెట్ పడుకుండా జాగ్రత్తాగా పడ్డారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న తరుణంలో ఆసీస్ కెఫ్టెన్ ఫించ్ రనౌట్ అవడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. ఫస్ట్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన స్మిత్, వార్నర్ లు భారత్ బౌలర్లను నిలువరిస్తు పరుగులు జోడించారు. అయితే డేంజరెస్ వార్నర్‌ను చాహల్ బోల్తా కొట్టించగా, ఖవాజాను బుమ్రా వికెట్ల ముందు బలిగొన్నాడు. అయితే స్మిత్ పట్టుదలగా ఆడటంతో ఆసీస్‌ లక్ష్యం ఛేదించేలా కనిపించింది. ఓ దశలో 36.4 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 40వ ఓవర్లలో భువనేశ్వర్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న స్మిత్‌ను, స్టొయినిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో మ్యాచ్‌ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. అనంతరం బుమ్రా, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ ఓటమి ఖాయమైంది. భారత్‌ బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, చాహల్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఐసీసీ వన్డే టోర్నమెంట్లో భారత్‌ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే టీమిండియా రెండు అగ్ర జట్లపై మ్యాచ్‌లు గెలిచి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. టీమిండియా తదుపరి మ్యాచ్ ఈ నెల 13వ తేదీన నాటింగ్‌హమ్‌ వేదికగా న్యూజిలాండ్‌ తో తలపడనుంది. అయితే న్యూజిలాండ్ కూడా ఈసారి మంచి జోరుమీదుంది. అయితే విరాట్ సేన ఇదే విదంగా రెచ్చిపోతే సెమీ ఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *