ప్రతి ఒక్కరూ ధోనీ అవలేరు

ప్రతి ఒక్కరూ ధోనీ అవలేరు
భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా…ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని,గౌరవాన్ని సాధించినవాడు మహేంద్రసింగ్ ధోనీ. బ్యాట్స్‌మెన్‌గా ఎంత విజయవంతమయ్యాడో,వికెట్ కీపర్‌గా అంతకుమించి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు.రిటైర్ అవుతున్న సచిన్‌కు కానుకగా భారతజట్టుకు ప్రపంచ కప్ అందించిన సారథిగా అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నాడు.ఆ తర్వాత ఎన్నో అరుదైన విజయాలతో,చాకచక్యమైన నిర్ణయాలతో…కీలకమైన మ్యాచుల్లో ప్రశాంతమైన ప్రణాళికతో జట్టుని,జట్టు సభ్యుల్ని ముందుకు నడిపిన నాయకుడిగా భారత క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు.
దినేశ్ కార్తీక్ కావాలి!
అయితే…ఇపుడు ధోనీ తర్వాత భారతజట్టుకు సరైన కీపర్ దొరికే అవకాశాలు లేకుండా పోయాయా? అనే ప్రశ్న సగటు క్రీడాభిమానికి సైతం కలవరపెడుతున్న విషయం.అవసరమైన సందర్భాల్లో జట్టులో చేరి కీపింగ్ బాధ్యతలను తీసుకునే దినేశ్ కార్తీక్ రెగ్యులర్ కీపర్‌గా రాణించలేకపోతున్నాడు.అరుదైన సందర్భాల్లో మాత్రమే జట్టుని ఆదుకుంటున్నాడు.దినేశ్ కార్తీక్ తర్వాత…ధోని గైర్హాజరీ సందర్భంలో జట్టుకు దొరికిన మంచి కీపర్‌గా రిషబ్ పంత్ సేవలందిస్తున్నాడు.ధోనీ రిటైర్ ప్రకటిస్తే రిషబ్ రెగ్యులర్ కీపర్‌గా మారుతాడు అని అందరూ అనుకున్నారు.కానీ…ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన పొరపాట్లే జట్టులో తన స్థానాన్ని సందేహంలో పడేశాయి.యువ వికెట్ కీపర్‌గా రిషబ్ చక్కగా రాణిస్తున్నాడు, అతన్ని ప్రపంచకప్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలంటూ క్రికెట్ అభిమానుల నుంచి డిమాండ్‌లు కూడా వచ్చాయి.క్రీడాభిమానుల నుంచి ఇలాంటి ప్రశంసలు వస్తుండటంతో సెలెక్టర్లు సైతం దినేశ్ కార్తీక్‌ని పక్కనపెట్టి ఆస్ట్రేలియాతో వన్డే జట్టుకు ఎంపిక చేశారు.తొలి మూడు వన్డేల్లో ధోనీ ఉండటంతో పంత్‌కు ఛాన్స్ రాలేదు. ప్రపంచకప్ దగ్గరపడుతుండటంతో ధోనీకి చివరి రెండు వన్డేలకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో రిషబ్‌కు అవకాశం దొరికింది.
చిన్న పొరపాట్లు..పెద్ద ఫలితాలు
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో చాలా బాగా రాణించాడు.కానీ వికెట్ కీపర్‌గా ఏ మాత్రం ప్రతిభను చూపించలేకపోయాడు.ఒక్క మ్యాచ్‌లోనే చాలా పొరపాట్లను చేయడంతో రిషబ్ పంత్ స్థానంపై ఇపుడు నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.ఆదివారం మ్యాచ్‌లో రెండు కీలకమైనటువంటి స్టంపింగ్‌లను విడిచిపెట్టి భారతజట్టుకు విజయాన్ని దూరం చేశాడు.పైగా ఒక ఈజీ స్టంప్‌ను ధోనీ స్టైల్‌లో చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.అది చూసిన ప్రేక్షకులు ధోనీ..ధోనీ…అంటూ కేకలు వేశారు.కొహ్లీ అయితే…మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా జట్టు ఓటమికి స్టంప్ ఔట్, క్యాచ్‌లు చేజార్చడమే అని చెప్పాడు.
ఇదంతా ఇలా ఉంటే…సోషల్ మీడియాలో భారత క్రీడాభిమానుల ట్రోల్‌కు రిషబ్ బలవుతున్నాడు.ఇండియా జట్టు ఓడిపోవడానికి పంతే కారణమని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఫన్ పేజీలైతే…రకరకాల ఫన్నీ మీమ్స్ చేసి సెటైర్లు వేస్తున్నారు. ‘అంపైర్..ఇపుడు పంత్‌ను మార్చేయొచ్చా’ అని కొహ్లీ అడుగుతున్నట్టుగా మీమ్స్ చేసి హడావుడి చేస్తున్నారు.’ ప్రతి ఒక్కడూ…ధోనీ కాలేడబ్బా..ధోనీ స్థానాన్ని భర్తీ చేయాలంటే ఎవరి వల్ల కాదూ అంటూ కామెంట్ చేస్తున్నారు.పంత్ కన్నా దినేశ్ కార్తీక్ ఎంతో నయమని…దినేశ్‌కు ఉండే అనుభవం ప్రపంచకప్ మ్యాచుల్లో ఎంతో అవసరమని కొందరు ప్రశ్నిన్స్తున్నారు.దినేశ్ కార్తీక్‌ను వెంటనే జట్టులోకి తీసుకోవాలని గట్టిగా అడుగుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *