కొన్నేళ్లుగా టీమిండియా విజయాల వరుసతో దూసుకుపోతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మునుముందుకు నడుస్తోంది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫార్మాట్లకు అతీతంగా ప్రతిభ కనబరుస్తోంది. మన ఆటగాళ్లు కూడా సూపర్ ఫామ్ కనబరిచి, ప్రత్యర్థులను వణికిస్తున్నారు. మరుసటి సిరీస్‌లో… ఆస్ట్రేలియాలో ఆసీన్‌ను మట్టికరిపించగల ధీమాతోనూ ఉంది. కానీ అది టీమిండియాకు అసలైన సవాల్ అని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవా అభిప్రాయపడ్డాడు.
అసలైన సవాల్…
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండాయకు కఠినపరిక్ష ఎదురుకానుందని స్టీవా అభిప్రాయపడ్డాడు. తమ దేశానికి వచ్చి, తమ పిచ్‌లపై తమను ఓడించడం అంత సులువు కాదన్నాడు.
పటిష్టమైన ఆసీస్ బౌలింగ్‌తో, ఇండియా ఆటగాళ్లకు తిప్పలు తప్పవన్నాడు. బౌలింగే వారి బలమనీ, తమకు బాగా అలవాటైన పిచ్‌ల మీద ఇండియాకు ముచ్చెమటలు పట్టించగలమన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, వికెట్లు తీయగల బౌలింగ్ తమ సొంతమని చెప్పుకొచ్చాడు. తాము టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుని… 350 పరుగులు చేస్తే, మ్యాచ్ తమచేతుల్లో ఉన్నట్టేనని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీని పొగిడేసాడు…
అలా టీమిండియాకు సవాలు విసిరిన స్టీవా, కోహ్లీని పొగడ్తల్లో ముంచేశాడు. కోహ్లీ అసాధారణ ఆడగాడిగా చెప్పి… సచిన్, లారాలతో పోల్చాడు. ఇండియా జట్టులో ఎంతోమంది మెరుగైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అందరికంటే కోహ్లీనే ప్రమాదకరమన్నాడు. గత పదిహేనళ్ల కాలంలో, ప్రస్తుతమున్న టీమిండియా జట్టే అత్యుత్తమమైనదన్న రవిశాస్త్రి వ్యాఖ్యలను కొట్టిపారేశాడు.