హీరోగా అవకాశాలు లేకపోవడంతో విడాకులు తీసుకోబోతున్న దంపతులు

హీరోగా అవకాశాలు లేకపోవడంతో విడాకులు తీసుకోబోతున్న దంపతులు

జానే తు యా జానే నా సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ త‌క్కువ టైంలో ల‌వ‌ర్ బోయ్‌గా మారాడు. ఎంద‌రో అమ్మాయిల మ‌న‌సులు దోచుకున్న ఇమ్రాన్ 8 ఏళ్ళుగా ప్రేమించిన అవంతిక మాలిక్‌ని జ‌న‌వ‌రి 10,2011న పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరికి ఓ పాప కూడా జ‌న్మించింది. అయితే పెళ్లైన మొద‌ట్లో వీరి సంసారం స‌జావుగానే సాగిన ఆ త‌ర్వాత చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయ‌ట‌. హీరోగా అవ‌కాశాలు లేక‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా అవ‌కాశాలు కరువ‌వ్వ‌డంతో ద‌ర్శ‌కుడిగా మారాడు ఇమ్రాన్‌. అయితే ప్రొఫెష‌న‌ల్ లైఫ్ అంత బాగోలేక‌పోవ‌డంతో ఆ ఒత్తిడిని త‌న భార్య‌పై చూపించాడ‌ట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌త‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో అవంతిక తన ఐదేళ్ల కూతురుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిందని సమాచారం‌. ఇమ్రాన్ సొంత మావ‌య్య అమీర్ ఖాన్ ఇద్దరికి నచ్చ‌జెప్పి సంసారాన్ని చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నం చేసిన అది వ‌ర్కవుట్ కాలేద‌ట‌. ఇక వారిద్ద‌రు విడాకులు తీసుకోవ‌డం ఖాయమ‌ని అంటున్నారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *