భారత వైమానికదళ దాడిపై పాక్ స్పందన

భారత వైమానికదళ దాడిపై పాక్ స్పందన

భారత సైన్యం చేసిన దాడికి పాకిస్తాన్ బెంబెలెత్తింది. పదిరోజుల క్రితం ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత వాయుదళం మంగళవారం తెల్లవారుఝామున ఎల్‌వోకె పరిధిలో దాడిచేసి పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసినట్టు ధృవీకరించారు. భారత సైన్యం చేసిన దాడికి పాకిస్తాన్ బెంబెలెత్తింది. పదిరోజుల క్రితం ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత వాయుదళం మంగళవారం తెల్లవారుఝామున ఎల్‌వోకె పరిధిలో దాడిచేసి పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసినట్టు ధృవీకరించారు. 

Pakistani Prime Minister Imran Khan holds emergency meeting after surgical strike2
‘ భారత్ ఇలాంటి పని చేస్తుందని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాము. మా వ్యాఖ్యలను భారత్ ఈరోజు నిజం చేసింది. దీనికి ప్రతిగా మేము కూడా సమాధానం చెబుతాము. వాస్తవాధీన రేఖను దాటి భారత ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించింది. ఇపుడు మేము ఆత్మరక్షణలో భాగంగా సరైన జవాబు చెప్పే హక్కు మాక్కూడా ఉంటుంది కదా ‘ అని వెల్లడించారు. 
పుల్వామా దాడిలో భారత జవాన్లు 49 మంది అమరులైనప్పటి నుంచి భారతదేశ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీనికి బదులు తీర్చుకోవాలని వందల, వేల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌లో తలదాచుకున్న జైష్ ఏ మహమ్మ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులతో విరుచుకుపడింది. 12 మిరాజ్ జెట్ ఫైటర్స్‌తో పేలుడు పదార్థాలతో దాడి జరిపింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ట్రైనీ ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎలా అనుసరించాలో చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మంత్రులు, ఆర్మీ అధికారలతో అత్యవసరంగా భేటీని ఏర్పాటు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *