అద్దెకు రూమ్ కావాలి అంటే... ఏ కులమో చెప్పాల్సిందే...

అద్దెకు రూమ్ కావాలి అంటే... ఏ కులమో చెప్పాల్సిందే...

దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదంటే  అది కచ్చితంగా కుల వివక్షతనే. భారతదేశంలో సామాన్యుడి నుండి రాష్ట్రపతి వరకు ఎవరు ఎక్కడ ఏ మూలకు వెళ్లిన కులం అనే మహమ్మారి ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది.అగ్ర స్థానాల నుండి చివరకు అద్దె ఇండ్ల వరకు ఈ వివక్షత కొనసాగుతూనే ఉంది. నగరంలో అద్దె ఇండ్లు ఇవ్వడానికి కూడా అగ్ర కులాల వారికే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. సామాన్యులకు మాత్రమే కాకుండా దళిత ,బీసీల్లో ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉన్న వారికి కూడా ఈ పరిస్థితులు తప్పడం లేదు. మంచి ఉద్యోగం చేస్తూ … ఐదు అంకెల జీతం సంపాదిస్తోన్నా కులం కారణంగా ఇండ్లు దొరకడం లేదు.

కుల వివక్షత…

ఇక ప్రయివేట్ రంగంలోని ఉద్యోగుల్లో తమ కులానికి చెందిన వారికే తమ దగ్గర ఉద్యోగాలు ఇప్పించుకొంటున్న పరిస్థితి ఉందని చాలామంది వాపోతున్న సమయంలో తమ కులం వారికి లేదా అగ్రకులాలకే ఇండ్లు ఇవ్వడం లాంటి పరిస్థితి నెలకొందంటే రానురాను కుల వివక్షత తీవ్రమైన సమస్యగా రూపాంతరం చెందబోతుందని అర్ధం చేసుకోవచ్చు.

కుల, మత ప్రమేయం లేని పాలన చేస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చే నాయకులు తమ రాజకీయాల కోసం కుల సమస్యలను రెచ్చగొడుతూనే ఉంటారు.

ఈ లోకంలో…

21 శతాబ్దంలో కూడా మన సమాజానికి కుల, మత పిచ్చి తగ్గడం లేదు. మన సమాజంలో కులం వాడని సందర్భాలను వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు. ప్రతి విషయాన్నీ కులంతో పోల్చుకోవడం  కుల సమీకరణలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ప్రేమ,పెళ్లి, ఓటు దేనికైనా కులం చూసి ముందడుగు వేసేస్తున్నారు. ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నా కూడా మా కులం వారిదే రక్తం కావాలి అని అడుగుతున్న మహానుభావులింకా ఈ లోకంలో మనతో పాటే బ్రతుకుతున్నారింకా. దీన్ని బట్టి అర్ధం అవుతుంది కుల పిచ్చి ఎంతలా వేళ్ళునుకుందో. ఈ కుల మహామ్మారి అద్దె ఇంటికి కూడా పాకింది.. ప్రజలు ఆ చట్రంలో ఇరకకుండా చూసే బాధ్యత మానందరిపై ఉంది.

మరీ ఈ జాడ్యం వదిలేది ఎప్పుడో చూడాలి….

 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *