ప్రపంచ కప్‌ 2019 : కప్ కొల్లగొట్టేదెవరు..!

ప్రపంచ కప్‌ 2019 : కప్ కొల్లగొట్టేదెవరు..!

యావత్‌ క్రికెట్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ కప్‌ సంబరం రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. విశ్వసమరంలో అన్ని జట్లు తమ తమ అస్త్రాలతో బరిలో దిగుతున్నాయి. మరి ఈ వల్డ్ కప్‌ ను ఏ దేశం గెలుచుకుంటుంది..? టీంమిండియాకు ఎంత వరకు కప్ గెలిచే అవకాశాలున్నాయి.

icc world cup

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. మే 30 నుంచి జులై 14 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. నెల రోజులకు పైగా జరిగే మెగా టోర్నీలో 10 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టు 9 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌ లండన్ వేదికగా ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. జూన్‌ 5 నుంచి టీమిండియా సమరంలోకి దిగుతుంది. టీమిండియా తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వరల్డ్‌కప్‌ను ఈ సారి రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తో పాటు అస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాడ్ ఈ సారి ఫెవరెట్లు గా బరిలోకి దిగుతున్నాయి. అయితే సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లాడుకు కలిసోచ్చె అంశం. వెస్టిండిస్ ఈ సారి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ లాంటి పొట్టి క్రికెట్ పుణ్యమా అని విండిస్ ఆటగాళ్లు జోరుందుకున్నారు. ఇక ఎప్పుడు అంచనాలకు అందని పాకిస్థాన్ తమదైన రోజు ఎంత స్ట్రాంగ్‌ టీమ్‌న్‌ అయిన సరే చిత్తు చేయలదు. న్యూజిలాండ్ గత వల్డ్ కప్‌లో ఫైనల్ ఓటమితో ఈసారి మరింత కసిగా బరిలోకి దిగనున్నారు. సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్, ఆల్‌రౌండర్లతో నూతనోత్సాహంతో ఉన్న ఆఫ్గనిస్తాన్ ఈ సారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి.

ఇక టీమిండియా విషయానికొస్తే స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా బలంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్న రోహిత్, దావన్‌ల జోడి శుభారంభం అందిచడంపైనే భారత విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్‌, దావన్‌లలో ఒక్కరు క్రీజులో నిలదొక్కకున్న స్కోరు పరుగులు పెట్టడం ఖాయం. వల్డ్ నంబర్ వన్ బ్యాట్సమన్ కోహ్లీ సత్తా చాటెందుకు సిద్దంగా ఉన్నాడు. ఆటగాడిగా ఇప్పటికే రెండు వల్డ్‌కప్‌లు ఆడిన కోహ్లీ ఈసారి కెఫ్టెన్‌గా జట్టు భారాన్ని మరింత మోస్తున్నాడు. ఆటగాడిగా కోహ్లీ విఫలం అవడం అరుదు కాబట్టి కెఫ్టెన్సీలో విరాట్ సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే కెఫ్టెన్ కోహ్లీకి ధోని లాంటి మాస్టర్‌ పీస్ సహచరుడిగా ఉండటం టీమిండియాను కప్‌లో ఫేవరెట్‌గా పరిగణించడంలో మొదటి అంశం. చురకైన కీపింగ్‌తో పాటు కీలక సమయాల్లో విరాట్‌కు ధోని ఇచ్చే సలహాలు చాలా విలువైనవి. అంతేకాదు ఈ మద్య దూకుడైన బ్యాటింగ్‌తో పాత ధనాధన్‌ ధోని బయటకు వచ్చాడు.. దీంతో అభిమానులు పుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఎప్పనుంచో వేధిస్తున్న 4 వ నంబర్ ఆటగాడి సమస్య కెఎల్ రాహుల్‌తో తీరిపోయింది.

వల్డ్‌కప్ లాంటి మెగాటోర్నిల్లో విజేతగా నిలవాలంటే ఆల్‌రౌండర్లు పాత్ర కీలకం.. అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణిస్తూ.. ఫీల్డింగ్‌తో అబ్బురపరిచే ఆల్‌రౌండర్లు కప్‌ గెలవడంతో కీలక పాత్ర పోషిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ,సౌతాఫ్రికా, విండిస్, న్యూజిలాండ్ నిఖార్సైన ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా కూడా ముగ్గురు ఆల్ రౌండర్లకు 15 మందిలో చోటు కల్పించింది.

అయితే విజయ్ శంకర్ బ్యాటింగ్‌లో పరువాలేదనిపిస్తున్న బౌలింగ్ తో అంతతమాత్రంగానే ఆకట్టుకుంటున్నాడు. మరో ఆల్‌రౌంర్ జడేజా బ్యాట్స్‌మెన్‌గా రాణించడం అరుదు. జట్టు ఆశలన్ని హార్డ్ హిట్టర్‌ హార్ధిక్ పాండ్యపైనే పెట్టుకుంది. కీలక సమయాల్లో రెచ్చిపోయి ప్రత్యర్థులకు సిక్సర దండకం చేసే హార్థిక్ ఈ వల్డ్ కప్ లో భారత్‌ కు ట్రంప్ కార్డుగా అందరు భావిస్తున్నారు.

బౌలింగ్ విషయానికొస్తే గతంలో ఎన్నడు లేని విధంగా మన జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం జస్ప్రి త్‌ బుమ్రానే. పదునైన యార్కర్లతో.. బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు తెప్పించె బుమ్రాతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయల షమీ పైనే భారత్ బౌలింగ్ ఆశలు పెట్టుకుంది. భువనేశ్వర్ కుమార్‌ తో పాటు కుల్దీప్, చాహల్ స్థాయి మేరకు సత్తా చాటితే భారత్‌కు తిరుగులేనట్లే.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే భారత్ 3 సారి ప్రపంచ కప్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాని ఇంగ్లాండ్ లాంటి స్వింగ్ పిచ్‌లకు భారత ఆటగాళ్లు ఎంత మాత్రం అలవాటు పడ్డరానేది కీలకంగా మారనుంది. అయితే ఈ సారి ఇంగ్లండ్ పిచ్‌లు బ్యాటింగ్‌కూ అనుకూలించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా అస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లాంటి దేశాలను దాటుకుంటు టీమిండియా జగజ్జేతగా నిలవాలనేది సగటు క్రికెట్ ప్రియుని ఆకాంక్ష… ఆల్‌ ది బెస్ట్ టు టీమిండియా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *