తలలు పట్టుకున్న పాక్ ఆటగాళ్లు..దాయాది ఆటగాళ్లలో పెరుగుతున్న ఒత్తిడి!

తలలు పట్టుకున్న పాక్ ఆటగాళ్లు..దాయాది ఆటగాళ్లలో పెరుగుతున్న ఒత్తిడి!

ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఇండియా, పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి రాకూడదని ప్రార్థిస్తుంటే…పాక్ ఆటగాళ్లు మాత్రం ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి ఒకే ఒక కారనం..ఇప్పటిదాకా ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా భారత్‌పై గెలవలేకపోవడమే.! దీనికి తగ్గట్టుగానే ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు నాలుగింటిలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం. అలాంటిది పాక్ జట్టు సెమీస్‌కి వెళ్లాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి తీరాల్సి ఉంది. దీంతో పాక్ ఆటగాళ్లకు భారత్ టీమ్ ఒకవైపు, తప్పక గెలవాల్సిన మ్యాచ్ అనే టెన్షన్ ఒకవైపు ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు.ఈ విషయాన్ని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మరింత స్పష్టంగా చెప్పాడు. ‘ పాక్ టీమ్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈరోజు భారత్ చేతిలో ఓడిపోతే…సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతుంది. పైగా చిరకాల ప్రత్యర్థులు కూడా కావడం వల్ల రెండు దేశాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకూ ప్రపంచకప్‌లో పాక్ జట్టుతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉండటం ఆ టీమ్‌ను మరింత ఒత్తిడిలోకి పడేస్తోంది ‘ అని చెప్పారు గవాస్కర్. వీటన్నిటితో పాటు సుధీర్ఘమైన విరామం తర్వాత ఇరుజట్లు తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘గత మ్యాచ్‌లకంటే ఈ మ్యాచ్‌లో ప్రేక్షకుల భావోద్వేగాలు పెరగనున్నాయీ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *