ఐఏఎస్ ఆఫీసర్‌ కొడుకు పెళ్లి ఖర్చు రూ.36,000

ఐఏఎస్ ఆఫీసర్‌ కొడుకు పెళ్లి ఖర్చు రూ.36,000
పెళ్ళి… చాలా మంది జీవితాల్లో ఇది ఒక ముఖ్య ఘట్టం.  అన్ని మత సంప్రదాయాల్లోనూ పెళ్ళికి చాలా ప్రాధాన్యత ఉంది. పేద, పెద్ద అనే భేదాల్లేకుండా అందరూ తమ తమ స్థాయిలకి మించి జరుపుకొనే ఫంక్షన్లలో పెళ్ళి  ఒకటి.  కానీ ఇప్పుడది స్టేటస్ సింబల్‌గా మారింది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఓ ఐఏఎస్‌ అధికారి పెళ్ళి జరిపించనున్నాడు. తన కొడుకు పెళ్లికి కేవలం రూ.36వేలు మాత్రమే ఖర్చు పెట్టబోతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
 
Basanth Kumar

డబుల్ షాక్‌

విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి కమీషనర్‌గా పనిచేస్తున్న పట్నాల బసంత్‌కుమార్‌ తన కుమారుని పెళ్ళిని కేవలం 36 వేల రూపాయలతో జరిపించబోతున్నాడు. ఈ ఆఫీసర్‌కు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారు కాదు. గతంలోనూ కూతురి పెళ్లికి ఇటువంటి ఆలోచనే చేశాడు. ఆ ఆలోచనను ఆచరణలోనూ పెట్టాడు. ఎవరూ ఊహించని విధంగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ కుమార్తె పెళ్లిని కేవలం పదహారు వేల రూపాయలతో జరిపించాడు. ఇప్పుడు మరోసారి కొడుకు విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకుని డబుల్ షాక్‌ ఇచ్చాడు. ఈ నిర్ణయం పట్ల అన్నిచోట్ల నుంచీ, అన్నిరంగాల ప్రముఖల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ఇది ఎంతో మంది ఫాలో అవ్వాల్సిన విషయమని ఈ ఆఫీసర్‌ను కొనియాడుతున్నారు. ఈ నెల 8న జరగబోయే ఈ పెళ్ళికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరు కానుండడం విశేషం. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *