హైదరాబాద్‌లో చిన్నారులకు రక్షణ లేదా?

హైదరాబాద్‌లో చిన్నారులకు రక్షణ లేదా?

ఆడుకుంటూ చిన్నారులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆడుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభం పట్టుకుని చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పార్కులో సిమెంట్ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ హైదర్ గూడ‌లో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్కులో సిమెంట్ బల్లపై నుంచి కిందపడి ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో దిలీప్‌శర్మ అనే బాలుడు సమీపంలోని సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు. అప్పటికే ఆ బెంచ్ విరిగి ఉంది. ఒక్కసారిగా సిమెంట్ బెంచ్ బోల్తా పడింది. దాని కింద దిలీప్‌శర్మ చిక్కుకుపోయాడు. అతడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు వెంటనే అక్కడికి వచ్చి బల్లను పక్కకు నెట్టినా అప్పటికే విగతజీవిగా మారాడు.

విషయం తెలుసుకున్న దిలీప్‌శర్మ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. విరిగిపోయిన సిమెంట్ బెంచ్ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. పార్క్ నిర్వహణ సరిగ్గా లేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. పిల్లలు ఆడుకునే చోట ప్రమాదకరంగా ఉన్నవాటిని తొలగించడమో, మరమ్మతు చేయడమో చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *