మత్తులోనూ మందుబాబుల దేశ భక్తి...

మత్తులోనూ మందుబాబుల దేశ భక్తి...

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన భారత్‌ X పాక్‌ మ్యాచ్‌లో కోహ్లేసేన 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆలపించిన జాతీయగీతానికి హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందుబాబులు లేచి నిలబడి దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

సహజంగా ఏ ఆట ప్రారంభానికి ముందైనా ఆయా జట్ల జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణ విషయమే. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వాళ్లు లేచి నిలబడి ఆటగాళ్లతో పాటు గీతాన్ని ఆలపిస్తారు. ఇక టీవీల ముందు ఉన్న వారు సైతం నిలబడి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మొన్న జరిగిన మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందు తాగడానికి వచ్చిన వారు అక్కడి టీవీలో జాతీయ గీతం ప్రసారమయ్యేటప్పుడు లేచి నిలబడ్డారు. దీంతో దేశభక్తికి సమయం, సందర్భం, స్థలం లాంటి విషయాలతో సంబంధం లేదని నిరూపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *