విశాఖ ఫిన్ టెక్ ఫెస్టివ‌ల్‌లో హ్యూమ‌నాయిడ్ రోబో సోఫియా సంద‌డి

విశాఖ ఫిన్ టెక్ ఫెస్టివ‌ల్‌లో హ్యూమ‌నాయిడ్ రోబో సోఫియా సంద‌డి

విశాఖ‌ప‌ట్నంలోని ఫింటెక్ ఫెస్టివ‌ల్‌లో మొద‌టి హ్యూమ‌నాయిడ్ రోబో సోఫియా సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌, రోబో సోఫియాల మ‌ధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. మనుషులు, రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో ఉండటం సాధ్యం అవుతుందా అని లోకేష్ అడిగిన ప్రశ్నకి సమాధానం సోఫియా స‌మాధానం ఇచ్చింది. రోబోలు మనుషులకు మరింత దగ్గర అయ్యే రోజులు వస్తున్నాయ‌ని, అనేక రంగాల్లో రోబోలు మనుషులకు సహకారం అందించే అవకాశాలు ఉన్నాయ‌ని, మెడికల్ థెరపీతో సహా అనేక రంగాల్లో రోబోలు అనేక సేవలు అందించే అవకాశం ఉంద‌ని సోఫియా తెలిపింది…

Humanoid Robot Sophia

ప్రపంచంతో పోటీ…

పోలీసింగ్ కోసం ప్రభుత్వం రోబోలు ఉపయోగించే అవకాశం ఉందా అని మంత్రి నారా లోకేష్‌ని సోఫియా అడ‌గ్గా.. ఒక్కప్పుడు రోబో కాప్స్ అనేది ఊహజనితం. కానీ పెరుగుతున్న టెక్నాలజీతో త్వరలోనే రోబో పోలీసింగ్ నిజం అయ్యే రోజులు దగ్గర ఉన్నాయ‌ని, నిఘా కోసం రోబో కాప్స్ వినియోగించే అవకాశాలు ఉన్నాయ‌ని మంత్రి లోకేష్ స‌మాధానం ఇచ్చారు. మా ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది. 2050కి ప్రపంచంతో పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఉత్తమ వేదికగా మార్చాలి అని పనిచేస్తున్నాం అని సోఫియాతో మంత్రి లోకేష్ అన్నారు. తిత్లీ లాంటి తుఫాను విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా? విపత్తులు వచ్చినప్పుడు నువ్వు ప్రాణ త్యాగం చేస్తావా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం విపత్తులను ఎదుర్కొనే సామర్ధ్యం తనకుకు లేదని.. కానీ జరుగుతున్న అభివృద్ధి వలన రానున్న రోజుల్లో ఇది సాధ్యం అవుతుందని సోఫియా వివరణ ఇచ్చింది.

humanoid robot Sophia

2 వేల మందికి పైగా…

వైజాగ్‌ను ఫిన్‌టెక్‌ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోన్న ఏపీ ప్రభుత్వం ఏటా ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌-2018ను ఫిన్‌టెక్ వ్యాలీ,సింగపూర్‌కు చెందిన సింగ్ఎక్స్ సంయుక్తంగా నిర్వహించారు. 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ ఉత్సవానికి.. 2 వేల మందికి పైగా ఫిన్‌టెక్‌ నిపుణులు హాజరయ్యారు…ఈ సందర్భంగా  ఫిన్ టెక్,  అగ్రిటెక్, ఎమర్జీటెక్  మూడు క్యాటగిరీ లలో  పోటీలు నిర్వహించిన పోటీల్లో. మొత్తం 40 కంపెనీలను ఎంపిక చేయగా,  వాటిలో 25 కంపెనీలను క్యాష్ ప్రైజ్ కు ఎంపిక చేశామని, మిగిలిన 15 కంపెనీలను  తుదిజాబితాలో చేర్చమన్నారు తెలిపారు.   జాబితాలోనుండి ప్రతి కేటగిరీలో విన్నర్,రన్నర్ లను  ఎంపికచేసి నగదుబహుమతి, అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *