తెలంగాణాలో భారీగా పట్టుబడుతున్న డబ్బు

తెలంగాణాలో భారీగా పట్టుబడుతున్న డబ్బు

ఎన్నికల సందర్భంగా చేస్తున్న తనిఖీల్లో పోలీసు అధికారులకు క్యాప్ తిరిగిపోయేంత సొమ్ము దొరుకుతోంది. తాజాగా, పెంబర్తి చెక్‌పోస్ట్ దగ్గర జరిపిన సోదాల్లో రూ. 5.8 కోట్ల డబ్బు దొరికింది. దీంతో కలుపుకుని ఇప్పటిదాకా తెలంగాణ ఎన్నికలకు ముందు పోలీసులకు దొరికిన సొమ్ము విలువ రూ. 118 కోట్లు.

hawala case in telangana

ఏ నాయకులదో తెలిసిపోయింది…

ఈ కేసులో కె కుమార్ జైన్, రామ్ , ప్రశాంత్ లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. మిగతా వివరాల గురించి మాట్లాడుతూ…” ఈరోజు ఉదయం గోషామహల్ నుంచి బయళ్దేరిన స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని తనిఖీ చేశాం. కారులోని సీట్ భాగంలో సొమ్ము దాచినట్టు కనిపెట్టాం. ఈ డబ్బుని తెలంగాణ నాయకులు నామా నాగేశ్వర్‌రావు, వడ్డిరాజు రవిచంద్ర, కొండా మురళి లకు పంచడానికి తెస్తున్నట్టు కనిపెట్టాము ” అని వెల్లడించారు.

బాగానే దొరుకుతోంది!

ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 7న జరుగుతున్నందున…ఇదివరకటి కంటే ఎక్కువ డబ్బే తనిఖీల్లో పట్టుబడుతోంది. గతంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనంలో నుంచి రూ. 6 కోట్లు పట్టుకున్నారు పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *