డైట్ ఫిల్స్ వేసుకుంటే బరువు తగ్గుతారా..?

డైట్ ఫిల్స్ వేసుకుంటే బరువు తగ్గుతారా..?

ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధి ఊబకాయం..ఊబకాయంతో బీపీ, షుగర్ దగ్గర నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ వ్యాధులు వస్తాయి. దీంతో ఊబకాయులు బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలామంది ఊబకాయులు వ్యాయామం లాంటి కష్టమైన ప్రక్రియ లకు దూరంగా ఉంటూ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న డైట్ ఫిల్స్ వేసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు..ఇంతకీ ఈ డైట్ ఫిల్స్ మంచివేనా..? నిజంగా ఇవి వేసుకుంటే బరువు తగ్గుతారా..?

ఊబకాయం..అధిక బరువు..ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు. ఊబకాయుల సంఖ్య మనదేశంలోనే 3 కోట్ల మంది ఉంటారంటే ఇక ప్రపంచంలో సంఖ్య ఎన్నికోట్లు ఉంటుందో అర్థం చేసుకోండి. చాలా మంది ఊబకాయులు వ్యాయామానికి బద్దకిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వీక్ నెస్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని కంపెనీలు పోటీపడి డైట్ ఫిల్స్ ను మార్కెట్లో కి తెచ్చాయి. ప్రముఖ సంస్థలైన అమెజాన్ టాంటి సంస్థల ద్వారా ఆన్ లైన్ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి ఈ ఫిల్స్ . అయితే ఈఫిల్స్ లో అసలు ఏ పదార్థాలు ఉంటాయి, ఏ రసాయనాలు ఉంటాయనేది మార్థం పేర్కొనడంలేదు. పైగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఫలితం లేకపోతే డబ్బులు వాపస్ అంటూ కొత్త మార్కెటింగ్ విధానాలకు తెరదీస్తున్నాయి డైట్ ఫిల్స్ సంస్థలు.

వాస్తవానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం మార్కెట్లోకి వచ్చే ఏ ఫిల్ అయినా ఆ ఫిల్ లో ఉండే పదార్థాల వివరాలు తప్పనిసరిగా వినియోగదారుడికి తెలియజేసేలా ఆఫిల్స్ పై ముద్రించాలి. కానీ డైట్ ఫిల్స్ లో అవేం ఉండవు. ముంబాయికి చెందిన ఫుడ్ టెక్నాలజిస్ట్ శారద అనే మహిళ ఈ డైట్ ఫిల్స్ పై పరిశోధన చేసి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు తెచ్చింది. ఈ ఫిల్స్ లో కాల్షియం బేటా బ్యుట్రైట్, పొటాషియం బేటా హైడ్రాక్సి బ్యుట్రైట్, సోడియం బేటా హైడ్రాక్సి బుట్రైట్ అనే పదార్థాలు ఉన్నాయని తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *