ఐదేళ్లు కష్టపడి మహిళలు జీవం పోసిన నది..!

ఐదేళ్లు కష్టపడి మహిళలు జీవం పోసిన నది..!

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువైపోవడం, నీటిమట్టం తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటి వినియోగం కూడా ఎక్కువగా పెరిగిపోతూండటంతో భూగర్భ జలాలు కూడా పూర్తీగా తగ్గిపోయే స్థితికి వచ్చేశాయి. ఇక నదులు కూడా అంతరించిపోతున్నాయి. దేశంలోని సగం ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో నీటి ఎద్దడి వల్ల ప్రముఖంగా వినిపిస్తున్న రాష్ట్రం తమిళనాడు. మొత్తం 24 జిల్లాల్లోనూ తాగునీరు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీటిలో వేల్లూరు జిల్లా కూడా ఉంది. ఈ జిల్లాలో దశాబ్దాల కిందట నాగానది ఉండేది. ఈ నది 15 ఏళ్ల కిందట కనుమరుగైంది. ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం కోసం ఆ జిల్లాలోని మహిళలు ఈ నాగానదికి జీవ్తం పోశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 వేలమంది మహిళలు ఈ నదికి తిరిగి జీవాన్ని ఇచ్చారు. వీరి శ్రమకు పట్టిన కాలం ఐదేళ్లు. నదీ పరీవాహక ప్రాంతంలో 3500 చెక్ డ్యాం్‌లు, రీచార్జ్ వెల్స్ నిర్మించి 2018 నాటికి సంపూర్నమైన నదిని కళ్లముందు నిలిపారు.

నదీ తిరిగి పునరుజ్జీవనం పొందడంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. నాగనిధి నది పునరుద్దరణ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేకరన్ ఈ నది విశేషాలు చెప్పారు. చెక్ డ్యామ్‌లు, రీచార్జ్ వెల్స్ వల్ల నది ఉపరితలంపై నీరు ప్రవహించడమే కాకుండా భూగర్భంలోకి జలాలు ఇంకుతాయని వివరించారు. వర్షాలు కురిసిన తర్వాత నదిలో నీటి ప్రవాహం మొదలవుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగనధి నది పునరుద్దరణ పనులు ప్రారంభమయ్యాయి. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కేంద్రం చేయూతనిచ్చింది.

గత పదేళ్ల కాలంలో వర్షాభావం, నీటి వనరులు అడుగంటిపోవడంతో బతుకుతెరువు కోసం వెల్లూరు జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు భారీ సంఖ్యలో పట్టణాలకు వలస వెళ్లారు. అయితే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ల రాకతో వారి జీవితాల్లో మార్పు వచ్చింది. అంతరించిపోయిన నాగనధి నదికి తిరిగి జీవాన్నిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటకలో ఇంతకుముందు వేదవతి, కుముదావతి నదులను విజయవంతంగా పునరుద్దరించారు. తొలుత ఉద్యోగుల బృందం శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నదిని గుర్తించారు. తర్వాత దాని భౌగోళిక స్వరూపం, పరివాహక ప్రాంతం, వర్షపాతం వంటి వివరాల ఆధారంగా ప్రణాళిక రూపొందించారు.

దీనికి అనుమతి లభించడం ద్వారా 20 వేల మంది మహిళలను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేర్చుకుని పనులు ప్రారంభించారు. అనంతరం పనులు ప్రారంభించి 20 అడుగుల లోతు, 15 అడుగల పొడవు, 6 అడుగల వెడల్పుతో గుంతలను తవ్వి నది పునరుద్దరణ పనులు మొదలుపెట్టారు. కేవలం రూ.5 కోట్ల వ్యయంతో నాలుగేళ్లలో 20,000 మంది మహిళలు శ్రమించి నదికి ప్రాణాన్నిచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *