కల్కి స్పెషల్ సాంగ్ : “హార్న్ పామ్ ...

కల్కి స్పెషల్ సాంగ్ : “హార్న్ పామ్ ...

హీరో రాజశేఖర్. గరుడ వేగ సినిమా విజయంతో మళ్ళీ హీరోగా ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజశేఖర్ కల్కి అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో రాజశేఖర్ ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడట. అదేంటో చూద్దాం..

గరుగవేగ సినిమాతో చాలా రోజుల తరువాత మళ్లీ ఫాంలోకి వచ్చాడు రాజశేఖర్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డిఫరెంట్ స్టోరీతో చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కల్కి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక రాజశేఖర్ యంగ్ లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే గరుడ వేగ సినిమాలో బాగా వర్కవుట్ అయిన సెంటిమెంట్ ను ఈ సినిమాలో కూడా వాడబోతున్నారని తెలుస్తోంది. అదే ఐటమ్ సాంగ్ సెంటిమెంట్.గరుడ వేగలో డియో డియో ఐటెం సాంగ్ లో హాట్ బ్యూటీ సన్నీలియోన్ తన అందచందాలను ఆరబోస్తూ డ్యాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పాట ఎలా ఉన్నా సన్నీలియోన్ వల్ల ఈ వీడియో కి 70 మిలియన్ కి పైగా వ్యూ లు దక్కాయి.అలాగే కల్కి సినిమాలో కూడా హార్న్ ఓకే ప్లీజ్ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. బాహుబలి వంటి సినిమాలలో మెరిసిన స్కార్లెట్ విల్సన్ రాజాశేఖర్ తో డాన్స్ చేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *