ఇద్దరూ అమ్మాయిలే...పెళ్లికి సిద్ధమయ్యారు

ఇద్దరూ అమ్మాయిలే...పెళ్లికి సిద్ధమయ్యారు

కాలం మారుతోందని ఆశ పడతాం. జండర్‌ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పులను చూసి ఆనందపడిపోతాం. అనాదిగా వివక్షను ఎదుర్కొంటూ కుంగిపోతున్న LGBT లకు సుప్రీం ఇటీవలే ఊపిర్లు వదిలింది. వారి హక్కుల కోసం పోరాడిన వారూ ఆ విజయాన్ని ఆస్వాదించారు. కోర్టుల పెద్దన తీర్పునిచ్చినా, వారి పిల్లలను అర్ధం చేసుకోవడంలో తల్లిదండ్రుల ఆలోచనా తీరు మాత్రం ఇంకా మారలేదు. ఒకరినొకకు అమితంగా ప్రేమించుకున్న ఇద్దరి యువతల ప్రేమను వారి అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. దీంతొ ఆ ఇద్దరూ కలవడానికీ, కలిసి బతకడానికీ పెద్ద తంతే జరిగింది.

homosexuality

ఇద్దరి యువతుల ప్రేమకథ…

అది ఒడిశాలోని కేంద్రపారా జిల్లా. ఓ ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు. సుప్రీం కోర్టే అనుమతిచ్చిందీ… తల్లిదండ్రలు ఒప్పుకుంటారులే అనే ధీమాతో ముందుకు నడిచారు. తామున్న స్థితినీ, తమ నిర్ణయాన్నీ కుటుంబపెద్దలకు చెప్పారు. వాళ్లు ససేమిరా అన్నారు. మహాకాపరా, పట్టముండై ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరమ్మాయిలూ చిన్నప్పటి నుంచీ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. అప్పటి నుంచీ ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. అదే క్రమంగా ప్రేమగా మారింది. అమ్మానాన్నలు మాత్రం దీనికి నో చెప్పారు. పైగా ఇద్దరికీ సంబంధాలుచూడటం మొదలుపెట్టారు. దీంతో ఆ ఇద్దరూ కోర్టును ఆశ్రయించి, తమ గోడును వెళ్లబోసుకున్నారు. అఫిడట్‌ దాఖలు చేశారు. పెళ్లి చేసుకుంటామనీ, జీవితాంతం కలిసి బతుకుతామనీ, భవిష్యత్తులో ఎలాంటి గొడవలూ పడమనీ, ఏ ఫిర్యాదులూ చేయమని ఆ అఫిడట్‌లో పేర్కొన్నారు. చివరికి కోర్టు సహకారంతో వీళ్ల పెళ్లి పట్టాలెక్కింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *