ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. దీనిని విచారించిన న్యాయస్థానం రీ కౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఆదేశించింది. అంతేకాదు వివరాలు కోర్టు ముందుంచాలని పేర్కొంది. అయితే గత వాయిదాల్లో వివరాలు అందించాల్సిన ఇంటర్‌ బోర్డు మరో వారం గడువు కోరింది. దీంతో విచారణ నేటికి వచ్చింది. అయితే ఈసారైన ఇంటర్‌ బోర్డు కోర్టుకు వివరాలు అందిస్తుందా అన్నది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *