మళ్లీ మొదటికే వచ్చిన యంగ్ హీరో శర్వానంద్

మళ్లీ మొదటికే వచ్చిన యంగ్ హీరో శర్వానంద్

ఫెస్టివల్ హీరో శర్వానంద్ సక్సెస్ రేసులో వెనుకబడిపోతున్నాడు. పడి పడి లేచే మనసు అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ సినిమా హిట్‌తో మరో స్టెప్ ఎక్కుతాడు అనుంటే ఫట్‌ మని కిందికిపడిపోయాడు.దీంతో అప్ కమింగ్ మూవీతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అందుకే న్యూ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్. శతమానం భవతి మూవీ హిట్ తరువాత మరో సక్సెస్ అందుకోలేదు శర్వా.అయితే ఈ హీరోతో సినిమా చేస్తే మినిమమ్ వసూళ్లు రావడం గ్యారెంటీ. కానీ భారీ అంచనాలతో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అప్పటివరకు ఉన్న ఈ హీరో మార్కెట్ కాస్త మహనుభావుడు, పడి పడి లేచే మనసు ప్లాప్‌లతో డిల్ అయింది. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే సుధీర్ వర్మ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట శర్వా.

ఈ సినిమా షూటింగ్ చివర దశకు చేరింది. కానీ ఇప్పటి వరకు మూవీ టైటిల్ ఎంటీ అనేది అనౌన్స్ చేయలేదు చిత్రటీమ్.. త్వరలోనే మూవీ టైటిల్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో శర్వాకు కాజల్ నటిస్తోంది. తాజా షెడ్యూల్‌ను కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా యూనిట్ అక్కడికి చేరుకోనుంది. 15 రోజుల పాటు అక్కడ ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. మే 31న సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్‌ కాగానే 96 రీమేక్‌లో జాయినైపోతాడు. మరి ఈ సినిమాతో శర్వా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *