ప్రియ‌ద‌ర్శి బైక్ దొంగ‌త‌నం వెనుక అస‌లు క‌హానీ ఇదీ..!

ప్రియ‌ద‌ర్శి బైక్ దొంగ‌త‌నం వెనుక అస‌లు క‌హానీ ఇదీ..!

ప్ర‌ముఖ క‌మెడీయ‌న్ ప్రియ‌ద‌ర్శి తెలంగాణ యాస‌లో త‌న‌దైన కామెడీతో ఎంత‌గా అల‌రిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన మ‌ల్లేశం చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆయ‌న న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు ల‌భించాయి. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ప్రియ‌ద‌ర్శిని త‌మ ప్రాజెక్ట్‌లో తీస‌కోవాల‌ని ‘నిను వీడని నీడను నేనే’ టీం భావించింది. ఆయ‌న డేట్స్ దొర‌క‌కపోవ‌డంతో క‌నీసం ప్రియ‌ద‌ర్శి బైక్‌ని సినిమాలో చూపించాల‌ని ప్లాన్ వేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ప్రియ‌ద‌ర్శి బైక్‌ని నిన్న రాత్రి ఓ వ్యక్తి ముసుగేసుకుని వచ్చి ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో రికార్డైన వీడియోని ప్రియ‌ద‌ర్శి త‌న ట్విట్ట‌ర్లో షేర్ చేస్తూ..సీసీ కెమెరా ఉన్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి త‌న బైక్‌ని ఆ దొంగ ఎత్తుకెళ్ళాడ‌ని ట్వీట్ చేశాడు. ఈ విష‌యం మ‌రింత పెద్ద‌ది అవుతున్న నేప‌థ్యంలో సందీప్ కిష‌న్ త‌న ట్వీట్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు.

ప్రియద‌ర్శి బైక్‌ని ఎత్తుకెళ్ల‌డం ‘నిను వీడని నీడను నేనే’ సినిమా కోసం చేసిన ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌‌. బైక్ దొంగ‌త‌నం విషయం మేం అనుకున్నదానికన్నా సీరియస్‌ అవుతోంది. ప్రచారం కోసం మాత్ర‌మే ఈ ప‌ని చేశాము . మాకు ప్రియదర్శి డేట్లు దొరకలేదు. దాంతో సినిమాలో ఆయన బైక్‌ను చూపించాలని తీసుకెళ్లాం. నాకు ఈ బైక్‌ నడపడం చాలా నచ్చింది. లవ్యూ దర్శి బాయ్ అని ట్వీట్‌ చేస్తూ బైక్‌ నడుపుతున్న వీడియోను సందీప్ కిష‌న్ పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన ప్రియ‌ద‌ర్శి .. థ్యాంక్స్ అన్నా.. నా బైక్‌కి సినిమా ద్వారా అన్నా బ్రేక్ వ‌చ్చిందని పేర్కొన్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *