"ఇస్మార్ట్‌ శంకర్‌ " టీజర్‌ విడుదల

"ఇస్మార్ట్‌ శంకర్‌ " టీజర్‌ విడుదల

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్… ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, ఇస్మార్ట్ శంకర్ టీజర్ ని రిలీజ్ చేశారు. పూరి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉన్న ఇస్మార్ట్ శంకర్ పై మీరు ఒక లుక్కేయండి.

హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్పే క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసే పూరి జగన్నాధ్, స్క్రీన్ పైన తన ఎనర్జీతో మెప్పించే యంగ్ హీరో రామ్ పోతినేని కలిసి మొదటి చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్… అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. సాంగ్స్ మినహా టాకీ పార్ట్ పూర్తవడంతో, ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్, చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు.

డిఫరెంట్ లుక్, పక్కా హైద్రాబాదీ స్లాంగ్ లో పూరి మార్క్ డైలాగులని చెప్పిన మెప్పించిన రామ్.. కంప్లీట్ గా మేకోవర్ అయ్యి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ లో కథ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వకుండా కేవలం హీరోని ఎలివేట్ చేయడం పైనే ద్రుష్టి పెట్టిన పూరి, రామ్ ని డిఫరెంట్ గా చూపించడంలో సక్సస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజీఎమ్ కాస్త తేడా కొట్టినట్లు అనిపించినా కూడా ఇస్మార్ట్ శంకర్ ఎనర్జీకి సెట్ అయ్యేలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ తో చాలా లౌడ్ గా ఉన్న ఇస్మార్ట్ శంకర్ టీజర్ పూరి అభిమానులనైతే మెప్పిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ కి ఎంత వరకూ ఎక్కుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *