షూటింగ్ కంప్లీట్ చేసుకున్న జెర్సీ

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న జెర్సీ

కృష్ణార్జున యుద్దం సినిమాతో ప్లాప్ అందుకున్న నాని దేవదాసు సినిమాలో యావరేజ్ హిట్‌ని అందుకున్నాడు. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రతగా స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటు రోటీన్ ఫార్మాట్‌లో కాకుండా కాస్త భిన్న నేపథ్యం ఉన్న స్టోరీస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తెరెక్కుతున్న చిత్రం జెర్సీ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్స్‌కు, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు పిరియాడికల్ చిత్రం కావడం, నాని ఈ సినిమాలో మూడు ఢిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో హై రేంజ్‌లో ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి.

కన్నడ బ్యూటీ

క్రికెటర్‌ కావాలనుకున్న ఓ యువకుడు కలలు కంటాడు. అయితే కొన్ని అనివార్య కారణాలతో క్రికెటర్‌ కాలేకపోతాడు. ముప్పై ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ యువకుడు భారత క్రికెట్‌ టీంకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటాడు. తన కలను సాకారం చేసుకోవడానికి అతనెలాంటి సాధన చేశాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతనెలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడనేదే ప్రధాన కథాంశం. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.అయితే ఏప్రిల్‌ 19న విడుదల చేస్తారని అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కొన్ని కారణల వల్ల ఈ ఏప్రిల్‌ 5న విడుదల చేసే అవకాశం ఉందననే టాక్ టాలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తోంది. ఢిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాతో నాని ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *