హలో గురు ప్రేమ కోసమే మూవీ రివ్యూ

హలో గురు ప్రేమ కోసమే మూవీ రివ్యూ

గత కొంత కాలంగా హిట్స్ లేకపోవడంతో రామ్ అనుపమల కెరీర్ రిస్క్ లో ఉంది… ఈసారి ఎలా అయినా  కొట్టాలనే కసితో వీరు చేసిన సినిమా హలో గురు ప్రేమ కోసమే.. టీజర్, ట్రైలర్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కాకినాడలో అమ్మానాన్నతో లైఫ్ ఎంజాయ్ చేసే సంజు.. జాబ్ కోసం హైదరాబాద్ బయల్దేరతాడు, తన మామ మోటివేషన్ తో ఈ ప్రయాణంలో అతడికి అను పరిచయం అవుతుంది.. అనుకోని సంఘటన వలన  చిన్న గొడవ జరుగుతుంది.. అలా గొడవతో హైదరాబాద్ వచ్చిన సంజుకి… ప్రకాష్ రాజ్ కి సంజు వాళ్ళ అమ్మ మంచి ఫ్రెండ్ కావడంతో సంజుకి ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తాడు. ఆ తర్వాత సంజు రికమండేషన్తో ట్రైనర్‌గా ఐటీ జాబ్‌లో జాయిన్ అయ్యి ఆఫీసులో ప్రణీతను ఇంప్రెస్ చేస్తాడు.. కానీ ప్రణీత ప్రొపోజ్ చేసే టైంకి అనుపై తనకున్న ప్రేమని రియలైజ్ అయి ప్రణీత లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తాడు. ఈలోగా ప్రకాష్ రాజ్ తన కూతుఋ అనుకి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చి వస్తాడు. ఇది తెలిసిన సంజు షాక్ అవుతాడు. మరి చివరికి సంజు అను ఎలా ఒకటయ్యారనేది సినిమా కథ.

ram-pothineni anupama-param

ప్రకాష్ రాజ్…

సంజుగా.. రామ్ యాక్టింగ్ మరియు లుక్స్ చాలా బాగున్నాయి, టైటిల్ సాంగ్ లో డాన్స్ బాగా చేశాడు.. తనదైన స్టైల్లో కామెడీ చేస్తూ పంచ్ డైలాగులు వేస్తూ బాగా ఎంటర్టైన్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ ఫ్యామిలీ గాళ్ గా చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి… హీరోయిన్ కి ఒక మంచి ఫాదర్ గా అన్ని ద బెస్ట్ ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా, అలాగే హీరోకి ఫ్రెండ్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఆయన నటనకి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. మిగతా పాత్రలన్నీ వాళ్ల వాళ్ల పరిమితి మేరకు బాగానే యాక్టింగ్ చేశారు.

ram-pothineni anupama-param

బ్యాగ్రౌండ్ మ్యూజిక్…

కథలో పెద్దగా ఆకర్షించిన పాయింట్ లేకపోయినా కూడా సంభాషణలు చాలా బాగున్నాయి.. సెంటిమెంట్ సీన్స్ వచ్చే డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఆకట్టుకోలేకపోయినా కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు అనిపించేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  ముందే తెలిసిపోయే కథాంశం కావడంతో ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేయడంలో కొంత మేర విఫలమైనా కూడా అవేమి తెరపై కనిపించకుండా joyful గా సినిమా నడిపించడంలోదర్శకుడు త్రినాధ రావు సక్సస్ అయ్యారు.. పండగ సీసన్ లో కుటుంబంతా కలిసి కూర్చొని చూసేలా ఉన్న హలో గురు ప్రేమ కోసమే సినిమాకి యూత్ నుంచి రీపీటెడ్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *