ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. బానుడి ప్రతాపం కర్నూల్ జిల్లాలో ఒక్కసారిగా చల్లబడింది.
నంద్యాలలో ఉరుములు, ఈదురగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.వెలుగోడు మండలం గుంతకంద్యాలలో పిడుగుపాటుకు ఓ కొబ్బరి చెట్టు తగలబడిపోయింది. పక్కనే ఉన్న గుర్తుతెలియని గొర్రెల కాపరి మృతి చెందాడు. దీంతో స్థానికులు భయంతో ఇళ్లకే పరిమితమయిపోయారు.అయితే విజయనగరం జిల్లాలో కూడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం కురిసింది. శృంగవరపుకోటలో మధ్యాహ్నం 40 డీగ్రీలుగా నమోదైన ఎండ ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈదురు గాలులుతో కూడిన వడగళ్ల వర్షంతో స్థానికులు ఇళ్లకే పరిమితమై పోయారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *