చికెన్ తింటే స్వర్గానికి చీర్స్ చెప్పినట్టే..!

చికెన్ తింటే స్వర్గానికి చీర్స్ చెప్పినట్టే..!
నాన్‌వెజ్ అంటే అందరికీ ఇష్టమే. రోజులో చికెన్ లేనిదే ముద్ద దిగని వాళ్లు మన చుట్టుపక్కలే చాలామంది ఉంటారు. చికెన్‌లో ఎన్ని రకాలున్నాయో లెక్కకూడా లేదు. తక్కువ ధరకే రావడం. అందుబాటులో రేటులోనే దొరకడం. పైగా రుచుల్లో కూడా రకరకాలు చేసుకునే వీలుండటంతో నాన్‌వెజ్‌లో ఎక్కువగా చికెన్‌నే ఇష్టపడతారు. అయితే…చికెన్ తినే వారి నుంచి సొమ్ము చేసుకోవడానికి కొందరు చికెన్ షాప్ వాళ్లు మోసం చేసి అమ్ముతున్నారు. కోళ్లకు స్టెరాయిడ్లు ఇచ్చి వాటి మాంసాన్ని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. 

రేటు తక్కువని తింటే రూటు మారిపోతుంది..

ఇలా స్టెరాయిడ్లు ఇచ్చిన మాంసం తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక చిన్నపిల్లలకు కొత్త కొత్త జబ్బులు వచ్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల వెంటనే అనారోగ్యం రాకపోయినా దీర్ఘకాలంలో జబ్బుల బారిన పడొచ్చని చెబుతున్నారు. కాబట్టి చికెన్ తినేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనాలి అంటున్నారు. కొంచెం ధరెక్కువైనా సరే తెలిసిన వారి దగ్గర కొనడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలిపారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *