తెలంగాణపై చంద్రబాబు కుట్ర.. హరీష్ బహిరంగ లేఖ

తెలంగాణపై చంద్రబాబు కుట్ర.. హరీష్ బహిరంగ లేఖ

తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. 19 ప్రశ్నలతో కూడిన లేఖను బాబుకు హరీశ్‌రావు రాశారు. చంద్రబాబు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Harish Rao Letter To Chandrababu

హరీష్ బహిరంగ లేఖ

తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీశ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మేకవన్నె పులి

చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. తెలంగాణలో టీడీపీ పోటీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. బాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు మేకవన్నె పులి అని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్‌ ఇవ్వకుండా బాబు ఇబ్బందిపెట్టారన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో వెలుగుల తెలంగాణను రూపొందించామని హరీశ్‌రావు చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *