హరీష్ రావు పాత రికార్డుని దాటబోతున్నాడా!

హరీష్ రావు పాత రికార్డుని దాటబోతున్నాడా!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకీ కేరాఫ్‌ అడ్రస్‌ సిద్దిపేట ఎమ్యేల్యే అభ్యర్థి హరీష్‌ రావు. ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. గత ఎన్నికలలో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌ రావు…ఈ సారి కూడా ఆ రికార్డు బ్రేక్‌ చేసేలా కనబడుతోంది. ఉదయం 10.30 గంటలకు స్పష్తమైన మెజారిటీతో హరీష్ రావు తన సమీప అభ్యర్థి మీద 51 వేల ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఘనవిజయం సాధించిన హరీష్‌రావు ఆరోసారి కూడా భారీ ఆధిక్యం తన సత్తాను చూపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *