పొట్ట విప్పి చూడు కండోమ్స్ ఉండు! నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

పొట్ట విప్పి చూడు కండోమ్స్ ఉండు! నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

ఇన్నాళ్లు డ్రగ్స్‌ని తరలించడానికి రకరకాల ప్రయోగాలు చేశారు నేరస్థులు. ఇపుడు మరీ దారుణంగా తయారయ్యారు. గతంలో కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లు నింపుకుని ప్రయాణం చేయడం చూశాం. అలా చేస్తే దొరికిపోతున్నామని మరింత తెలివి ఉపయోగించబోయి ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయాడు ఒక వ్యక్తి.

అతన్ని పరిశీలించిన అధికారులకు తల తిరిగిపోయే విషయం తెల్సింది. ఎందుకంటే, ఆ వ్యక్తి కడుపులో 80 కండోమ్స్ ఉన్నాయి. ఈజిప్టుకు వెళ్లేందుకు 49 ఏళ్ల వ్యక్తి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని పూర్తీగా స్కాన్ చేశారు. స్కాన్‌లో చూస్తే అతని కడుపులో ఏదో దాచినట్లు అనుమానం కలిగింది. గట్టిగా నిలదీస్తే అలాంటిదేమీ లేదని మొదట బుకాయించాడు.

అబద్దం చెబుతున్నాడని భావించి డాక్టర్ల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. అతడి కడుపులో 80 కండోమ్స్ చూసి అవాక్కయ్యారు. అయితే వాటి నిండా దాదాపు 2 కిలోల 300 గ్రాముల కొకైన్ నింపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని కటకటాలకు పంపించారు అధికారులు. అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దీనార్లు అంటే దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత దుబాయ్ నుంచి బహిష్కరించాలని తీర్పు వెలువరించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *