తెలుగులో రిమేక్ చేయబోతున్న గల్లీ బాయ్

తెలుగులో రిమేక్ చేయబోతున్న గల్లీ బాయ్

రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గల్లీ బాయ్ సినిమా బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టి రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.నార్త్ భారీ హిట్ అయినా ఈ సినిమా కంటెంట్‌కు బాగా కనేక్ట్ అయిన టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ ఈ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయబోతున్నాడని తెలుస్తోంది.ఇంతకీ ఆ తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు? ఈ రీమేక్ లో నటించబోయే హీరో ఎవరో చూడండి

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో 2018ని గ్రాండ్ గా క్లోజ్ చేసిన బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్,2019లో కూడా తన స్పీడ్ ని కంటిన్యూ చేస్తూ వాలెంటైన్స్ డే నాడు ‘గల్లీబాయ్’గా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.మంచి కంటెంట్ కి పాజిటివ్ టాక్ కూడా కలవడంతో గల్లీ బాయ్ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 232కోట్లు రాబట్టింది ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టిన అల్లు అరవింద్ సాయి ధరమ్ తేజ్ ఈ రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నాడట.తేజ్ లో ఉండే ఎనర్జీ హీరో పాత్రకి సరిగ్గా సరిపోతుందని భావించిన అల్లు అరవింద్,వీలైనంత త్వరగా గల్లీ బాయ్ రీమేక్ రైట్స్ కొని ఇక పూజ కార్యక్రమాలు చేసి సినిమాని మొదలుపెట్టడమే ఆలస్యం అనుకుంటున్న టైములో సాయి ధరమ్ తేజ్ కి షాక్ ఇస్తూ…ఈ గల్లీ బాయ్ ప్రాజెక్ట్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ దెగ్గరికి వెళ్లింది.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న విజయ్ కాదంటేనే గల్లీబాయ్ సినిమా తేజ్ చేస్తాడు.అయితే ర్యాప్ మ్యూజిక్ కి కానీ,మెట్రో టైప్ ఆఫ్ కంటెంట్ కానీ నార్త్ లో క్లిక్ అయినట్లు సౌత్ లో ఆడవు,మన దెగ్గర అలాంటి కథలతో స్ట్రెయిట్ సినిమాలు రావడమే అరుదు,ఒకవేళ వచ్చినా ప్రేక్షకులని మెప్పించలేవు.ఇలాంటి సమయంలో వరస విజయాల మీదున్న విజయ్ దేవరకొండ కానీ ఇప్పుడే హిట్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ కానీ గల్లీబాయ్ సినిమాని తెలుగులో రీమేక్ చేసే రిస్క్ చేస్తారా అంటే కష్టమనే సమాధానమే వినిపిస్తుంది.మరి ఈ ఇద్దరు హీరోలు కాదంటే అల్లు అరవింద్ ఎవరితో ఈ మ్యూజికల్ మూవీని ఎవరితో చేస్తాడో అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *