శ్రీవారిని దర్శించుకున్న గోపాలకృష్ణ ద్వివేది

శ్రీవారిని దర్శించుకున్న గోపాలకృష్ణ ద్వివేది

ap ceo gopala krishna

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా ద్వివేది తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళలు, వికలాంగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా కొన్ని కొన్ని ఈవీఎంలు మొరాయించాయని వీలైనంత త్వరలోనే వాటిని కూడా మరమత్తులు చేయించామని స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *