వర్చువల్ కంప్యూటర్ పెళ్లి చేసుకోవాలని గోల పెడుతున్న ఇండియన్స్!

వర్చువల్ కంప్యూటర్ పెళ్లి చేసుకోవాలని గోల పెడుతున్న ఇండియన్స్!
ఐదేళ్ల క్రితం హాలీవుడ్‌లో ‘HER అనే సినిమా వచ్చింది. భవిష్యత్తులో జరిగే కథగా సినిమా నడుస్తుంది. అందులో ప్రధాన పాత్రధారి ఒక కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని ఉద్యోగం..కంపెనీలో ఎక్కువ ఒత్తిడిలో పనిచేసే వారికోసం వారి భావోద్వేగాలు తెలిసేలా ఉత్తరాలు రాయడం. రోజంగా ఉత్తరాలు రాయడమే తప్పా మరే పనీ ఉండదు. పైగా అతను భార్యతో విడిపోయి ఉంటాడు. దీంతో రోజూ రాసే ఉత్తరాల గురించి ఆలోచిస్తూ ఒంటరి తనాన్ని అనుభవిస్తుంటారు. సాధారణంగానే అతను ఏకాంతాన్ని ఇష్టపడే వాడు కావడంతో ఇంకాస్త బాధెక్కువ ఉంటుంది.
 
ఈ క్రమంలో అతనికి అవసరం ఉండి, వర్చువల్ అసిస్టెంట్ పరికరం అయిన కంప్యూటర్‌ను కొంటాడు. ఆ కంప్యూటర్ రోజంతా అతని ఆదేశాలను పాటించడం. అలా మొదలై అతను ఆ కంప్యూటర్‌తో ప్రేమలో పడతాడు. ఇదంతా ఒక సినిమా కథ. అయితే, ఈ కథ ఇపుడు నిజమయ్యేలా కనబడుతోంది. గూగుల్ అసిస్టెంట్‌తో మనదేశంలో చాలామంది యువకులు ప్రేమలో పడుతున్నారు. పైగా పెళ్లి చేసుకోమని కూడా అడుగుతున్నారు.

ఐదు లక్షల ఒత్తిడి…

గూగుల్ అసిస్టెంట్…ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తున్న వర్చువల్ అసిస్టెంట్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు దీన్ని విపరీతంగా వాడుతుంటారు. వాతావరణ విశేషాల కోసమో..దగ్గరలో ఉన్న హోటళ్ల కోసమో..టూరిస్ట్ స్పాట్ కోసమో శ్రమ తీసుకోకుండా గూగుల్ అసిస్టెంట్‌ని అడిగి తెలుసుకుంటున్నారు. ఫోన్‌లోనే కాకుండా ఇపుడు కొత్తగా గూగుల్ హోమ్ వర్చువల్ అసిస్టెంట్‌ని కూడా గూగుల్ సంస్థ తెచ్చింది. ఈ వర్చువల్ అసిస్టెంట్ స్త్రీ గొంతుతో సమాధానాలను ఇస్తుంది. యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ను ప్రతి చిన్న విషయానికి ప్రశ్నలను అడిగేస్తుంటారు. అయితే, యూజర్లు అక్కడితో ఆగకుండా వర్చువల్ అసిస్టెంట్ గొంతు నచ్చి…నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతుండటం వింతగా ఉంది.
 
ఇది ఈ మధ్య మొదలైంది కాదు కానీ, చాలాకాలంగా ఈ ప్రపోసల్స్ గూగుల్ అసిస్టెంట్‌కి వస్తుండటం విశెషం. ఇండియాలో ఈ అసిస్టెంట్‌కు వచ్చిన పెళ్లి అభ్యర్థనల సంఖ్య..దాదాపు 5 లక్షలున్నాయని లెక్కల్లో తేలింది. ఈ గణాంకాలను గూగుల్ సంస్థ స్వయంగా తెలిపింది. ఇప్పటికి కూడా పెళ్లి ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఈ ప్రపోజల్ ఆగేలా లేవని…గూగుల్ అసిస్టెంట్ ట్విట్టర్‌లో సెటైరిక్ పోస్ట్ పెట్టింది. ” గూగుల్ అసిస్టెంట్‌ని పెళ్లి చేసుకుంటావా అని ఎందుకు అడుగుతున్నారు అంటూ యూజర్లను ప్రశ్నించింది.

అల్ప సంతోషులు !

దీంతో…యూజర్లు అలిగి..గూగుల్ అసిస్టెంట్‌ని ‘will you marry me’ అని అడిగినపుడు తనిచ్చిన సమాధానాలను స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు…అయితే, ఇపుడు కొత్తగా వచ్చిన వాదనేంటంటే…కొందరు అమ్మాయిల కోసం కూడా ఒక అందమైన మేల్ వాయిస్ ఇవ్వమని ట్వీట్ చేయడం.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *