పాతికవేలు తగ్గిన గూగుల్ పిక్సెల్‌ ఫోన్‌

పాతికవేలు తగ్గిన గూగుల్ పిక్సెల్‌ ఫోన్‌

స్మార్ట్‌ఫోన్… ఎప్పుడో జీవితంలో భాగమైపోయింది. ఎప్పటికప్పుడు ఎన్నో కొత్తరకాల మోడల్స్‌ వస్తూనే ఉన్నాయి. వాటినే బట్టే వినియోగదారుల ఇష్టాయిష్టాలూ మారిపోతున్నాయి. ఏది ఎలా ఉన్నా, వేటి క్రేజ్‌ ఎంతలా సాగుతున్నా… కొన్ని బ్రాండ్స్‌ అంటే ఎప్పటికీ ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. వాటికంటూ ప్రత్యేకమైన అభిమానులూ ఉంటారు. గూగుల్‌ పిక్సెల్‌ ఆ కోవలోకే చెందుతుంది. యాపిల్ బ్రాండ్‌కు సపరేట్‌ క్రేజ్‌ ఉన్నట్టే దీనికీ ఉంది. ఐఫోన్‌ విషయంలో తలెత్తే సమస్యే దీనిలోనూ ఉంది. గూగుల్‌ పిక్సెల్‌ మీద ఎంత మనసు పారేసుకున్న వారికైనా దాని ధర భయపెడుతూనే ఉంటుంది. అయితే… తాజాగా ఈ సంస్థ భారీగా ధరలను తగ్గించి, వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.భారీ తగ్గింపు…

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకూ, గూగుల్ ప్రియులకూ… ఇదో అద్దిరిపోయే వార్త. ఈ సంస్థ… పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించేసింది. కొత్త ధరలను వెంటనే మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. నిన్నమెన్నటి వరకూ రూ.83,000 పలికిన గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్‌లో 64 జీబీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.27,501 తగ్గింది. తాజా ధరల ప్రకారం రూ.58,999కు అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సల్ 3లో 64 జీబీ వేరియంట్ ధర రూ.12,001 తగ్గిపోయింది. ఇప్పుడు రూ.58,999కు అందుబాటులోకి వచ్చేసింది. రూ.71,000 పలికిన 128 జీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.23,010 తగ్గి, రూ.59,990కు అందుబాటులోకి వచ్చేసింది.ఆన్లైన్లో అందుబాటులో…

కొత్త ధరలతో ఉన్న ఈ మోబైల్స్‌ అన్లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారిగా ధరలను తగ్గించడంతో సేల్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకూ అధిక ధరల్ని చూసి వెనకడుగు వేసిన వాళ్లు… ఇప్పుడు వీటిపై ఒక లుక్కేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *