నిలిచిపోయిన గూగుల్ సేవలు... కనిపెట్టిన భారతీయుడు

నిలిచిపోయిన గూగుల్ సేవలు... కనిపెట్టిన భారతీయుడు

గూగుల్‌ గురించి తెలియనివారుండరనే మాట చాలా పాతది. ఆ స్థాయిని దాటి గూగుల్‌ ఎప్పుడో ముందుకొచ్చేసింది. ఎంతో మందికి నిత్యజీవితంలో భాగమైంది. నెటిజన్ల పాలిట వరమైంది. ఎంతోమంది… ప్రాధమిక విషయాల నుంచీ, కీలక సమచారాల వరకూ గూగుల్‌నే నమ్ముకుంటున్నారు. ఈ మధ్యకాలంలో… టీచర్స్‌డే రోజున, సోషల్‌ మీడియా సాక్షిగా ఎంతోమందికి గూగుల్‌కు థాంక్స్‌ చెప్పుకుంటున్నారు. మనవాళ్లలో కొందరైతే… ప్రేమగా గూగుల్ మతా అని కూడా పిలుచుకుంటారు. ఇలాంటి గూగుల్‌ గంటకుపైనా నిలిచిపోతే ఎలా ఉంటుంది?  

google varthalu

స్తంభించాయి…

కోరినవారికి కోరిన సమాచారాన్ని అందించే గూగుల్ సేవలు 72 నిమిషాల పాటు స్తంభించిపోయాయి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.12 నుంచి 2.35 వరకు గూగుల్‌ సెర్చింజన్‌, అనలటిక్స్‌, మరికొన్ని క్లౌడ్‌ ప్లాట్‌ఫాంలు పనిచేయలేదు. నైజీరియాకు చెందిన టెలికాం సంస్థ చేసిన సైబర్‌ దాడే దీనికి కారణమంటున్నారు. గూగుల్ స్తంభించిన విషయాన్నీ, దాడి చేసిన సంస్థనూ మన భారతీయుడు అమిత్ నాయక్‌ గుర్తించాడు. ఈ దాడి వల్ల 72 గంటలపాటు అమెరికాతో,రష్యా, చైనా, నైజీరియాల్లో గూగుల్‌ సేవలు నిలిచిపోయాయి. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *