గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన కొత్తఫీచర్!

గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన కొత్తఫీచర్!

గూగుల్ మ్యాప్స్…సిటీల్లో ఏదైనా అడ్రస్ కనుక్కోడానికి శ్రమ లేకుండా కాపడుతున్న గొప్ప సాధనం. మనకు తెలియని ప్రాంతాల్లో అవసరమైన రెస్టారెంట్‌ను కనుక్కోవడానికైనా, హోటల్‌ను గుర్తించడానికైనా గూగుల్ మ్యాప్స్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడితో ఆగకుండా గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం మరో గొప్ప ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది గూగుల్ సంస్థ. అదేంటొ తెలుసుకుందాం….

కొత్తగా…

ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌తో అడ్రస్, రెస్టారెంట్, హాస్పిటల్ ఇలా అన్నిటినీ కనిపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు ఇపుడు కొత్తగా రెస్టారెంట్‌లో టెబుల్ బుక్ చేసుకోవడానికి, హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇంతే కాకుండా మనం ఎంపిక చేసుకున్న కంపెనీతో నేరుగా చాట్ చేసే ఫీచర్‌ని కూడా గూగుల్ సంస్థ తీసుకొచ్చింది. 

google varthalu

నేరుగా

” రెస్టారెంట్ వారితో నేరుగా చాట్ చేసి ముందుగానే టెబుల్ బుక్ చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు” అని గూగుల్ సంస్థ తమ బ్లాగ్‌లో వివరించింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోనూ, ఐఓయస్‌లోనూ అందుబాటులో ఉంటుందని చెప్పింది. బిజినెస్ ప్రొఫైల్ ఉన్నచోటే మేసే చేసే ఆప్షన్ ఉంటుందని, అక్కడే చాట్ చేసే అవకాశం కూడా ఉందని, ఆయా కంపెనీలు రిజిష్టర్ చేసి ఉంటేనే ఈ ఆప్షన్‌లో కనిపిస్తుందని తెలిపింది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *